Sunday, April 28, 2024

పంజాబ్ సిఎం ప్రధాన సలహాదారుగా తప్పుకున్న ప్రశాంత్ కిశోర్

- Advertisement -
- Advertisement -

Prashant Kishor resigns as Punjab CM's chief advisor

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితంలో చురుకైన పాత్ర నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ప్రశాంత్ కిశోర్ ఈ సందర్భంగా ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2017లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆ పార్టీని పంజాబ్‌లో అధికారంలోకి తీసుకురావడంలో కిశోర్ ప్రముఖ పాత్ర పోషించారు.

తన భవిష్యత్ కార్యాచరణపై తాను ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని, ఈ పరిస్థితులలో తనను ప్రధాన సలహాదారు బాధ్యతల నుంచి తప్పించాలని పంజాబ్ ముఖ్యమంత్రికి రాసిన ఒక లేఖలో కిశోర్ పేర్కొన్నారు. తనకు ఈ పదవిని అప్పగించినందుకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో కిశోర్‌ను ప్రధాన సలహాదారుగా నియమించిన అమరీందర్ సింగ్ ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను కూడా కల్పించారు. కిశోర్ గౌరవ వేతనంగా నెలకు ఒక రూపాయి మాత్రమే పొందుతున్నట్లు ఇదివరకు పంజాబ్ సాధారణ పరిపాలన శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News