Monday, May 6, 2024

గర్భవతిని ఆశా వర్కర్ తన ఆటోలో 20 కిలో మీటర్లు తీసుకెళ్లి….

- Advertisement -
- Advertisement -

Pregnant woman send to Hospital in Auto by Asha worker

 

బెంగళూరు: గర్భవతిని ఓ ఆశా వర్కర్ తన ఆటోలో 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి సుఖ ప్రసవం చేసిన సంఘటన కర్నాటకలోని ఉడిపి జిల్లాలో జరిగింది. పెర్నాన్‌కిలా గ్రామంలో రాజీవ్ నాయక్ అనే ఆమె ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తోంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆశా వర్కర్‌గా పని చేస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఆమె ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. శ్రీలత అనే గర్భవతికి నొప్పులరావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ సరైన సమయానికి రాకపోవడంతో స్థానికంగా ఉన్న ఆశ వర్కర్ రాజీవ్‌కు ఫోన్ చేశారు. ఆమె హుటాహుటినా అక్కడికి చేరుకొని గర్భవతిని తన ఆటోలో ఎక్కించుకొని 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న శాంభూ శెట్టి మెమోరియల్ హజీ అబ్ధుల్లా మథర్, చైల్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. సరైన సమయానికి తీసుకరావడంతో గర్భవతి పండంటి బిడ్డకు జన్మనించింది. దీంతో వైద్యులు ఆశా వర్కర్‌ను అభినందించారు. ఇప్పటి వరకు 16 మంది గర్భవతులను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించింది. ఇప్పటివరకు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సహాయం చేస్తున్నానని తెలిపింది. ఆమె భర్త కర్నాటక ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో ఆశా వర్కర్ రాజీవ్ గురంచి పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News