Saturday, April 27, 2024

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. గర్భిణీ, సహ శిశువు మృతి

- Advertisement -
- Advertisement -

డాక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకుల ఆందోళన
సంగారెడ్డి బ్యూరో: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పురిటి నొప్పులతో వచ్చిన మహిళ సహ శిశువు మృత్యువాతపడ్డ సంఘటన చోటుచేసుకుంది. సిర్గాపూర్ మండలంలోని కిషన్ నాయక్ తండాకు చెందిన రాథోడ్ రేణుక (23) పురిటి నొప్పులతో 20న జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. నార్మల్ డెలీవరీ చేస్తామని వైద్యులు చెప్పా రు. శుక్రవారం మధ్యాహ్నం రేణుకకు నొప్పులు రావడంతో అప్పటికప్పుడు డాక్టర్లు డెలివరీ చేశారు. అప్పటికే మగ శిశువు మృతి చెందింది. డెలివరీ అనంతరం రేణుక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను ఐసియుకు తరలించి చికిత్స అందించారు.

శనివారం ఉదయం రేణుక కూడ మరణించింది. తల్లి, బిడ్డ మృతి చెందడంతో కుటుంబీకులు, బం ధువుల రోదనలు మిన్నంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు డాక్టర్‌ల తీరుపై ఆందోళనకు దిగారు. రేణుకకు సిజేరియన్ చేయాలని వైద్యులను కోరిన డాక్టర్లు, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని కుటుంబీకులు చెప్పారు. డాక్టర్ల నిర్లక్షంతో రేణుక కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డాక్టర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యు లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు.

రేణుక మృతిలో డాక్టర్ల నిర్లక్షం లేదు
రేణుక రాథోడ్ మొదటి సారిగా ప్రసవం కోసం సంగారెడ్డిలోని ఎంసిహెచ్‌కు వచ్చారని, బిపితో అడ్మిట్ అయ్యారని, మృతురాలు రేణుకకు బిపి కంట్రోల్ చేయడానికి డాక్టర్లు తీవ్రంగా కృషి చేశారని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ తెలిపారు. ప్రసవం సమయంలో ఫిట్స్ రావడంతో మత్తు డాక్టర్ పర్యవేక్షణలో వెంటిలేటర్‌కు కనెక్ట్ చేశారన్నారు. ఈ విషయంలో డాక్టర్‌ల నిర్లక్షం కాని, బలవంతపు సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం కాని జరగలేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News