Saturday, April 27, 2024

బిజెపిలో ప్రాధాన్యత లేక రేవంత్‌పై ఈటల ఆరోపణలు : పాల్వాయి స్రవంతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తీవ్రంగా ఖండించారు. దొంగలు దోచుకుని పోయిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఎన్నికలు జరిగిన ఆరు నెలలకు ఈటెల ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతమా? లేక బిజెపి చేసిన ఆరోపణలా? అన్నది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు కెసిఆర్ రూ.25 కోట్లు ఇస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ చేతిలోనే పెట్టుకున్న బిజెపి ఎందుకు దర్యాప్తు చేయించలేదని ప్రశ్నించారు.

బిజెపిలో చేరికలు లేకపోవడంతో ఈటెల ఆవేదనతో ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమైందని జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తనకు అనేక అవరోధాలు కల్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డిని బిజెపి కొనుక్కోవడం వల్లే మునుగోడులో ఎన్నికలు వచ్చాయని, అందుకు ఆ పార్టీకి మునుగోడు ప్రజలు బాగా బుద్ధి చెప్పారని దుయ్యబట్టారు. ఈటెల తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి దిగజారుడు రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News