Wednesday, May 1, 2024

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించడానికి సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

migrants

 

న్యూఢిల్లీ : విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రావాలని ఎదురు చూస్తున్న భారతీయులను లాక్‌డౌన్ తరువాత రప్పించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈమేరకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్‌ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత భారతీయులను విమానాల ద్వారా రప్పిస్తారు. ఈ విధంగా విమానాల ద్వారా స్వదేశానికి రావాలనుకున్న వారు విమాన ఛార్జీలు చెల్లించవలసి వస్తుంది. విదేశాల్లో వేలాది మంది భారతీయులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని ఉన్నారు. దీనిపై భారతీయులను స్వదేశానికి తీసుకెళ్లాలని గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి వస్తోంది. ప్రత్యేకంగా కేరళ నుంచి రాజకీయ డిమాండ్ వస్తోంది.

 

Preparations for extradition of Indians trapped abroad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News