Monday, April 29, 2024

రిటైరైన మిలిటరీ వైద్య సిబ్బందిని విధుల్లో చేరాలని కోరిన సైన్యం

- Advertisement -
- Advertisement -

Prime Minister's Review with CDS Bipin Rawat

సిడిఎస్ బిపిన్ రావత్‌తో ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 ఉధృతి నేపథ్యంలో భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. సైనిక ఆస్పత్రుల్లో పని చేసి పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందిని తిరిగి విధుల్లో చేరాల్సిందిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. రెండేళ్ల నుంచి రిటైరైనవారు, స్వచ్ఛంద పదవీ విరమణ పొందినవారికి ఈ పిలుపునిచ్చారు. రెండేళ్లకు పూర్వం రిటైరైనవారు కూడా స్వచ్ఛందంగా విధుల్లో చేరాల్సిందిగా సూచించారు. సమీపంలోని సైనిక ఆస్పత్రుల్లో చేరాల్సిందిగా వారికి సూచించారు. కొవిడ్19 పేషెంట్లకు సైనిక ఆస్పత్రుల్లో వసతులు కల్పిస్తున్నతీరుపై రావత్‌తో ప్రధాని మోడీ సమీక్షించారు. సైన్యంలోని వివిధ విభాగాలకు చెందిన ఆస్పత్రుల్లో వైద్యాధికారులంతా విధులు కొనసాగిస్తున్నారని ప్రధానికి రావత్ వివరించారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో భారత వైమానిక దళం అందిస్తున్న సేవల గురించీ ప్రధానికి రావత్ వివరించారు. సైనిక ఆస్పత్రుల్లో పౌరులకు కూడా వైద్య సేవలు అందిస్తామని రావత్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News