Monday, May 6, 2024

అలా వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాం

- Advertisement -
- Advertisement -

Priyanka Chopra says about her career

 

మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ దక్కించుకున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో స్టార్స్ కాలేరు. సినిమాల్లోకి ఎంట్రీ అయితే దక్కుతుందేమో కానీ ఆ తర్వాత వారు ప్రతిభ కనబర్చకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్నాళ్లకే ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది. ఇది ఎంతో మంది విషయంలో నిరూపితమైంది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా మాత్రం తన ప్రతిభ, పట్టుదలతో బాలీవుడ్ స్టార్‌గానే కాకుండా గ్లోబల్ స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు దక్కించుకుంది. గ్లోబల్ స్టార్‌గా కీర్తించబడుతున్న ప్రియాంక చోప్రా తాజాగా ఒక సోషల్ మీడియా టాక్‌లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. “నేను మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్న తర్వాత బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. నా రెండవ సినిమా ‘అందాజ్’ పాట షూటింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లాం. అక్కడ పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఒక స్టెప్ కోసం ఏకంగా 40కి పైగా టేక్‌లు తీసుకున్నాను.

అది నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ సమయంలో నృత్య దర్శకుడు రాజ్ ఖాన్ నా పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మిస్ వరల్డ్ అయితే సరిపోదు.. సినిమాల్లో రాణించాలంటే కనీసం నటన, డ్యాన్స్ పట్ల అవగాహన ఉండాలి. ఆ మాత్రం లేకుండానే ఎలా సినిమాల్లోకి నటించేయాలని వచ్చావు. ఇండియా వెళ్లిన తర్వాత డ్యాన్స్ నేర్చుకో. లేదంటే నీ సినీ కెరీర్ ముందుకు సాగదు’ అంటూ హెచ్చరించాడు. ఆ సమయంలోనే నేను డ్యాన్స్, నటనపై పూర్తి దృష్టి పెట్టాను. ఇండియా వచ్చిన వెంటనే డ్యాన్స్ నేర్చుకున్నాను. మనకు రానివి నేర్చుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాము”అని ప్రియాంక చోప్రా పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News