Sunday, May 12, 2024

ఇంటింటి ఆరోగ్య సర్వేలో ఇబ్బందులెన్నో..

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

కంటైన్మెంట్ ప్రాంతాల్లో వివరాలు
ఇచ్చేందుకు వెనకడుగేస్తున్న జనాలు
ఒక్క చార్మినార్ జోన్‌లోనే 300 కరోనా కేసులు
ఆ ప్రాంతంలో.. మరికొన్ని కంటైన్మెంట్లలో సర్వే చేస్తున్న సిబ్బందికి సహకరించని స్థానికులు
చాంద్రాయణగుట్ట ఫార్ములా అమలుపై ఆలోచన

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్ర భుత్వం కంటైన్మెంట్ జోన్‌లను ఏర్పాటు చే సి, ఆ ప్రాంతాల్లో ఇంటింటి ఆరోగ్య సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్న సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి ప రిధిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క చార్మినర్ జోన్ నుంచే 300 కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు తెలిపారు. ఇప్పటికే చార్మినర్‌ను రెడ్ జోన్ (కంటైన్మెంట్)గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతం లో ఇంటింటి సర్వే చేసేందుకు అంగన్‌వాడీ టీచర్లు, ఆశాలు, ఎఎన్‌ఎమ్, వైద్య సిబ్బందిని రంగంలోకి దించారు. అయితే క్షేత్ర స్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వివరాలు అందించకుండా సిబ్బందిని దూషిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ప్రజలు సహకరించకపోతే కేసులు మరింతగా పెరుగతాయని పేర్కొంటున్నారు. తలాబ్ కట్ట ప్రాం తంలో ఒక్కరితో ఆ కుటుంబంలోని 20 మందికి వైరస్ సోకిందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ క్లస్టర్‌లో సర్వే కోసం ఒక నమూనాను ఇచ్చింది. అందులో ఇంటి పెద్ద ఎవరు ? ఇంట్లో ఎన్ని గదులున్నాయి? ఎంతమంది ఉంటున్నారు. ఇంటి వైశాల్యం ఎంత ఉంది? అనే తదితర వివరాలున్నాయి. అవి అడిగితే చెప్పడానికి నిరాకరిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

దీంతోనే ఎవరు అనారోగ్యానికి గురి అవుతున్నారో తెలియని స్థితి నెలకొని, పాజిటివ్ వచ్చిన వాళ్లతో వైరస్ వ్యాప్తి చెంది, కేసుల సంఖ్య పెరుగుతుందని వ్యాఖ్యానించారు. మిగతా రెడ్ జోన్ పరిధిలోనూ ఆరోగ్య సర్వే కోసం తాము వచ్చామని సిబ్బంది చెబుతున్నా.. మీరంతా ఎన్‌ఆర్‌సి సర్వే కోసమే పచ్చారని, తమ వివరాలు ఎందుకు చెప్పాలని ఎదురు తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఒకరిద్దరు క్షేత్రస్థాయి ఆరోగ్య సర్వేకు వెళ్లిన సిబ్బంది, ఈ విధులు కొనసాగించలేమని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నట్లు తెలిసింది.

సిఆర్‌పిఎఫ్ బందోబస్తు తప్పదా
కంటైన్మెంట్ పరిధిలో క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతే కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో చాంద్రాయణ గుట్ట ఫార్ములాను చార్మినర్ పరిధిలో వాడాలని భావిస్తోంది. ఈ పరిధిలో సిఆర్‌పిఎఫ్ (సెంట్రల్ రిజర్వుడ్ ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తుండటం, ఆ ప్రాంతంలో ఎక్కువ జన సంచారం లేకుండా చేయడం లాంటి చర్యలతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగలేదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. చార్మినార్‌లోనూ సిఆర్‌పిఎఫ్‌ను మోహరించి, జనసంచారం తగ్గించడంతో పాటు ఆరోగ్య వివరాలు రాబట్టాలని భావిస్తోంది. అలాగే అక్కడి వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, అలాగే మత పెద్దలను రంగంలోకి దించి, వారి సహకారం తీసుకోవడంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

 

Problems with Home Health survey
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News