Saturday, April 27, 2024

పదోన్నతులు పూర్తి

- Advertisement -
- Advertisement -

ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ

చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు
సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి:
సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు

CM Kcr orders to tripartite committee on PRC issues

మన తెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వం పదోన్నతుల సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించడంతో పలు శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. కొ న్ని శాఖల్లో కోర్టు కేసుల నేపథ్యంలో పదోన్నతులు ఆగిపోగా మరికొన్ని శాఖల్లో అర్హులందరికీ పదోన్నతులు లభించాయి. ఈ నేపథ్య ంలోనే పలు శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈనెల 31వ తేదీ లోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో త్వరితగతిన అన్ని జిల్లాల కలెక్టర్‌లు, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో డిపిసిలు సమావేశమై సీనియార్టీ ఆ ధారంగా ఉద్యోగులకు పదోన్నతులను కల్పించాయి. పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి రావడంతో వివిధ శాఖల్లో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డిపిసి) సమావేశాలు దాదాపు గా పూర్తయ్యాయి. ఒక్క సచివాలయం
తరువాయి 10లో
ఉద్యోగుల పదోన్నతులు మినహా చాలా శాఖల్లో పదోన్నతుల కమిటీకి సంబంధించిన సమావేశాలను నిర్వహించింది. పదోన్నతుల సందర్భంగా వార్షిక నివేదికలు, క్రమశిక్షణా చర్యలతో పాటు ఉద్యోగుల రిమార్కుల ఆధారంగా పదోన్నతులను కల్పించారు.డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ ఖాళీలను ఏ శాఖలోనూ ముట్టుకోలేదు. అయితే ప్రమోషన్‌ల కోటాలో ఖాళీల కంటే ఒకరిద్దరికీ అదనంగా పదోన్నతులు కల్పించారు. అదనంగా పదోన్నతులు పొందిన వారిని రిజర్వ్‌లో పెట్టారు.
ఏర్పడిన ఖాళీలు కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ
జిల్లా స్థాయిలో 14,380 మంది ఉద్యోగులకు పదోన్నతులను కల్పించారు. జిల్లాలో రెండురకాల డిపిసిల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. రెవెన్యూ, ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనార్టీ వంటి సంక్షేమ శాఖలో జిల్లా కేడర్ పోస్టులకు కలెక్టర్ ఆధ్వర్యంలో డిపిసిలను క్లియర్ చేయగా, మిగతా శాఖల్లోని పోస్టులకు ఆయా శాఖల జిల్లా అధికారుల ఆధ్వర్యంలో డిపిసిలు పదోన్నతులను కల్పించాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖల్లో సిబ్బంది అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడిన ఖాళీలను గుర్తించి కొత్త నోటిఫికేషన్ ద్వారా వాటిని భర్తీ చేయాలని భావిస్తోంది.
100 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సివిల్ సర్జన్‌లుగా
రిజిస్ట్రేషన్ శాఖలో 16 మంది సబ్ రిజిస్ట్రార్‌లకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా పదోన్నతి కల్పించడంతో పాటు 26 మంది సీనియర్ అసిస్టెంట్‌లకు గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్‌లుగా, మరో 40 ఇతర పదోన్నతులను కల్పించారు. వాణిజ్య పన్నుల శాఖలో 200ల మందికి, వైద్య ఆరోగ్య శాఖలో 943 మందికి ఆబ్కారీ శాఖలో 80 మందికి పదోన్నతులు కల్పించారు. ఇక రెవెన్యూ శాఖలో 179 మందికి డిప్యూటీ తహసీల్దార్‌ల నుంచి తహసీల్దార్‌లుగా పదోన్నతి లభించగా, జోన్ 5 పరిధిలో 87 మందికి, జోన్ 6లో 92 మందికి పదోన్నతులు దక్కాయి. వీటితోపాటు నాయబ్ తహసీల్దార్‌లకు సంబంధించిన సీనియార్టీ జాబితాను రూపొందించిన రెవెన్యూ శాఖ ఆ దిశగా పదోన్నతులు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు ఖాళీగా ఉన్న స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దీనికిగాను డిప్యూటీ కలెక్టర్‌లకు స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌లుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. పశుసంవర్ధక శాఖలో అర్హత కలిగిన వివిధ క్యాడర్‌లలో ఉన్న 98 శాతం ఉద్యోగులకు పదోన్నతులను కల్పించారు. ప్రజారోగ్యం, కుటుంబసంక్షేమ విభాగాల్లో పనిచేస్తున్న అర్హులైన 943 మంది ఉద్యోగులకు ఆ శాఖ పదోన్నతులను కల్పించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రమోషన్లు ఇచ్చినట్టు డిపిహెచ్ కార్యాలయం పేర్కొంది. ఇందులో 483 మంది పారామెడికల్ సిబ్బందికి పదోన్నతులు లభించగా, 100 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సివిల్ సర్జన్‌లుగా, అడిషనల్ డైరెక్టర్‌లుగా పదోన్నతులు కల్పించారు. పంచాయతీరాజ్ శాఖలో ఎంపిడిఓలకు సిఈఓలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు మరో 400ల మందికి పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు లభించాయి. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు డిపిసి పూర్తికాగా రెండురోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. విద్యాశాఖలో దాదాపు 19 వేల మందికి పదోన్నతులు లభించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఆపివేసినట్టుగా తెలుస్తోంది. ఇంటర్మీడియట్ బోర్డులో మాత్రం 139 ఉద్యోగులు (జోన్5,6)లో పనిచేస్తున్న వారికి పదోన్నతులను కల్పించినట్టు అధికారులు తెలిపారు.
సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు
టిఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్
అన్ని శాఖల్లో అర్హులకు పదోన్నతులు కల్పించడం హర్షించదగ్గ విషయం. ఉద్యోగులందరి తరఫున సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సిఎం కెసిఆర్ పరిష్కరించారు. మిగతా సమస్యలు పరిష్కారం కావడంతో పాటు పిఆర్సీ విషయంలోనూ ముఖ్యమంత్రి తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది.
అన్ని శాఖల్లో పండుగ వాతావరణం నెలకొంది
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి రాజేందర్
వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 900ల పైచిలుకు ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. ఇది సంతోషించదగ్గ పరిణామం. సిఎం కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని శాఖల్లో పండుగ వాతావరణం నెలకొంది. సిఎం కెసిఆర్‌కు, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు ఉద్యోగులందరూ రుణపడి ఉంటారు. గతంలో ఏ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఇలాంటి చర్యలు చేపట్టలేదు. ఇది ఒక్క సిఎం కెసిఆర్‌తో సాధ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News