Wednesday, May 1, 2024

వాషింగ్టన్‌లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

Protest by Trump supporters turned violent

 

ట్రంప్ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణ

వాషింగ్టన్ : అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదార్లు చేపట్టిన నిరసన చివరికి హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల మధ్య ఆదివారం చెలరేగిన ఘర్షణలలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పోలీసులు కూడా ఉన్నారని, పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని వాషింగ్టన్ పోస్టు పత్రిక తెలిపింది. అధికార వర్గాల కథనం ఇలా ఉంది. ఎన్నికలలో ఓటమిపాలయిన ట్రంప్‌నకు మద్దతుగా, ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనకారులలో ‘ఫ్రౌడ్ బాయ్స్ యాంటిఫా వంటి బృందాల సభ్యులు ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా ఉన్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ బృందం కూడా ప్రదర్శనకు దిగింది. ఈ క్రమంలో రెండు వేర్వేరు బృందాలు ఓ చోట ఎదురుపడ్డాయి. ఈ దశలో పరస్పర వ్యతిరేక నినాదాలు చెలరేగాయి. అవి శృతిమించి చివరికి ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పిడిగుద్దుల వరకూ పరిస్థితి దిగజారింది. చాలా చేసపటివరకూ సాగిన ఈ ఘర్షణ దశలో చివరికి పోలీసులు కూడా గాయపడ్డారు. వారు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది.

ట్రంప్ మద్దతుదార్ల చేతుల్లోని ఎరుపు రంగు జెండాలు, టోపీలను ప్రత్యర్థి వర్గం లాక్కుంది. వాటికి నిప్పంటించింది. దీనితో ప్రశాంతపూరిత వాషింగ్టన్‌లో పరిస్థితి భగ్గుమంది. ట్రంప్ వర్గం ప్రచార సామాగ్రి విక్రయశాలను అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. వైట్‌హౌస్‌కు అతి సమీంలోని ఫ్రీడం ప్లాజా వద్దనే విధ్వంసకాండ జరిగింది. దీనితో ఈ ప్రాంతంలోని భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఓ దశలో పెప్పర్ స్ప్రే వంటివి వాడారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.ఘర్షణల సమయంలోనే కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తితో పొడిచినట్లు, ఆ వ్యక్తిని తరువాత ఆసుపత్రిలో చికిత్సకు పంపించినట్లు వెల్లడైంది. ఉమన్ ఫర్ అమెరికా ఫస్ట్ గ్రూప్ ట్రంప్‌నకు మద్దతుగా నిరసనలకు పిలుపు నిచ్చింది. దీనికి అనుగుణంగా వేలాది మంది మధ్యాహ్యానికి ఫ్రీడం ప్లాజాకు చేరారు.

దీనిని తెలుసుకుని దేశంలోని నల్లజాతీయుల వర్గం రిఫ్యూజ్ ఫాసిజం ప్లకార్డులతో అటువైపు వచ్చింది. వారిని ట్రంప్ మద్దతుదారులు చుట్టుముట్టారు. యుఎస్‌ఎ, యుఎస్‌ఎ అంటూ నినాదాలకు దిగారు. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. రోజంతా ప్రదర్శనలు సామరస్యంగానే జరిగాయి. అయితే తరువాత రాత్రి అవుతున్న కొద్ది పరస్పరం కలహించుకున్నారు. పరిస్థితి చేజారింది. ఓ దశలో ప్రెసిడెంట్ ట్రంప్ తన కారులో ఈ ప్రాంతం నుంచే గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లుతుండగా ప్రదర్శనకారులు గమనించి జై కొట్టారు. ట్రంప్ వారికి అభివాదం చేస్తూ వెళ్లిపొయ్యారు. ప్రదర్శనను వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రెటరీ కెలియిగ్ మెక్ ఎనానీ గొప్పదిగా పేర్కొన్నారు. ఇది మిలియన్ మెగా మార్క్ అని లక్ష మందికి పైగా ట్రంప్ మద్దతుదార్లు తరలివచ్చారని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కేవలం వేలాది మందే ఇక్కడ గుమికూడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News