Monday, April 29, 2024

పంజాబ్ మంత్రి అమన్ అరోరాకు రెండేళ్లు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పంజాబ్ కేబినెట్ మంత్రి అమన్ అరోరాకు సునమ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ వివాదాల కేసులో అమన్ అరోరాకు ఈ శిక్ష పడింది. అమన్ అరోరాతోసహా తొమ్మిది మందికి రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. మంత్రి అమన్ అరోరా బావ రాజిందర్ దీప 2008లో కోర్టులో ఫిర్యాదు చేశారు. అమన్ అరోరాతోపాటు ఆయన సహచరులు తన ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడికి పాల్పడ్డారని రాజిందర్ దీపా కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఆ సమయంలో అమన్ అరోరా, రాజిందర్ దీపా ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నారు. సునామ్‌లో ఇద్దరు నేతల ఇళ్లు ఎదురెదురుగా ఉండగా, ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. అయితే ప్రస్తుతం ఇద్దరు నేతలు కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం అమన్ అరోరా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు కాగా, కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. రాజిందర్ దీపా అకాలీదళ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News