Monday, April 29, 2024

ఖమ్మం మార్కెట్ లో మిర్చికి రికార్డు ధర..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కేట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్‌ మిర్చికి రూ. 25,550గా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా పట్టి ధర నిర్ణయించారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కేట్ నందు నిర్వహించిన జెండా పాటలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు.

Puvvada Ajay Kumar participates in Khammam Mirchi Action

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ఖమ్మం మిర్చి మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది అని పేర్కొన్నారు.ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని, రైతులు పండించిన ప్రతి బస్తాలను కొనుగోలు చేస్తారన్నారు.  తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు. చైనా దేశం మిర్చి కంపెనీలు ఖమ్మంలో ఎర్పాటు చేసి చైనాకి క్వాలిటీ మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నారు. మిర్చి ఘాట్ కంటే రైతుల మీద ప్రేమ ఎక్కువ అని, అందుకే రైతుల ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. ఖమ్మం మార్కేట్ ను అంతర్జాతీయ మార్కేట్ కు చిరునామాగా తీర్చిదిద్దుతామని, చిల్లీస్ కు హబ్ గా చేస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News