Wednesday, May 8, 2024

ఏటా వందమంది విద్యార్థులకు క్వాడ్ ఫెలోషిప్

- Advertisement -
- Advertisement -

Quad Fellowship for hundreds of students annually

వాషింగ్టన్ : ప్రతి ఏడాది క్వాడ్ దేశాలకు చెందిన వందమంది విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వనున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. క్వాడ్ గ్రూపులో ఉన్న ప్రతి దేశం నుంచి 25 మందికి అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. అమెరికాలో స్టెమ్ గ్రాడ్యుయేట్ యూనివర్శిటీల్లో మాస్టర్స్ డిగ్రీ చదివేవారికి ఈ ఫెలోషిప్ ఇస్తారు. క్వాడ్ గ్రూపులో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి. కొవిడ్ వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, వాతావరణ సమస్యలు పెరిగాయని, ప్రాంతీయ భద్రత మరింత జటిలంగా మారిందని కరోనా మహమ్మారి అన్ని దేశాలను దెబ్బతీసినట్టు క్వాడ్ దేశాలు ప్రకటించాయి. క్వాడ్ దేశాల మధ్య సహకారం ఏమాత్రం తగ్గలేదని చెప్పాయి. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకు వచ్చింది. భారత్‌తో కలిసి వ్యాక్సిన్, డ్రగ్స్‌పై వ్యయం చేయనున్నది. జపాన్ బ్యాంకు ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్, హెల్త్‌కేర్ రంగంలో సుమారు వంద మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News