Monday, May 6, 2024

సంక్రాంతికే ‘రాధేశ్యామ్’

- Advertisement -
- Advertisement -

Radheshyam movie will release on Jan 14th 2022

 

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రమోషన్స్‌ను సైతం చిత్ర యూనిట్ త్వరలో షురూ చేయనుంది. అంతేకాకుండా ఈ చిత్రం పాటలు త్వరలో ఒక్కొకటిగా విడుదలకానున్నాయి. ఇక ఈ చిత్రం విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ఫిల్మ్‌మేకర్స్ తెలియజేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. యువి క్రియేషన్స్, టీ సిరీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదలు నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News