Monday, April 29, 2024

భారత్‌-సౌతాఫ్రికా రెండో టి20కి వరుణుడి ముప్పు!

- Advertisement -
- Advertisement -

గెబెహరా: భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టి20కి వరుణుడి ప్రమాదం పొంచి ఉంది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టి20 వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే రద్దుయ్యింది. ఇక గెబెహరాలోని సెయింట్‌జార్జ్ పార్క్‌లో జరిగే మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. మంగళవారం ఇక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఇరు జట్ల ఆటగాళ్లను కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని భావిస్తున్న ఇరు జట్లకు ఇది ఇబ్బందిగా మారింది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సత్తా చాటేందుకు తహతహలాడుతోంది.

సౌతాఫ్రికా వంటి బలమైన జట్టుతో జరిగే టి20 సిరీస్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్షంతో భారత క్రికెటర్లు ఉన్నారు. అయితే వీరిపై ఆశలపై ఇప్పటికే వరుణుడు నీళ్లు చల్లాడు. తాజాగా రెండో టి20లో అయినా సత్తా చాటాలనే పట్టుదలతో వీరి కనిపిస్తున్నారు. ఇలాంటి స్థితిలో వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆటగాళ్లలో కలవరం మొదలైంది. ఒకవేళ వర్షం పడితే కనీసం కొన్ని ఓవర్ల ఆటైన సాధ్యపడాలని వారు కోరుకుంటున్నారు. వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News