Sunday, May 12, 2024

కథంతా హైదరాబాద్ నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

Raja Vikramarka movie shoot wrapped up

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ’రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత రామారెడ్డి మాట్లాడుతూ “మా ‘రాజా విక్రమార్క’ కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో గుడిలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కథ ప్రకారం పురావస్తు శాఖవారు మూసి వేసిన దేవాలయం అయి ఉండాలి. లక్కీగా మాకు గండికోటలో అటువంటి టెంపుల్ దొరికింది. అందులో దర్భార్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గర్భగుడి వరకు అనుమతి ఇచ్చారు. మారేడుమిల్లి ఫారెస్టులో కీలక సన్నివేశాలు తీశాం. డంప్ యార్డ్‌లో ప్రీ క్లైమాక్స్ షూట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం”అని అన్నారు. దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ ‘కార్తికేయ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అవుతుంది. ఆయన ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తారు”అని తెలిపారు.

Raja Vikramarka movie shoot wrapped up

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News