Monday, April 29, 2024

పదవికే వన్నె తెచ్చిన వెంకయ్య: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

Rajnath Singh Released venkaiah naidu coffee table book

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టి నేటితో మూడేళ్లు పూర్తి అయింది. ఈ ముడేళ్ల ప్రయాణంలో ఎదురైన అనుభవాల గురించి ‘కనెక్టింగ్, కమ్మూనికేటింగ్, ఛేజింగ్’ పేరుతో వెంకయ్యనాయుడు రాసిన పుస్తకాన్ని మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విడుదల చేశారు. 250 పేజీల ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖకు చెందిన ప్రచురణల విభాగం రూపొందించింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్య నాయుడు వన్నె తెచ్చారు. ఉపరాష్ట్రపతి కాకముందు నుంచి వెంకయ్య నాయుడిని గమనిస్తున్నా. కీలక సందర్భాల్లో వెంకయ్య వ్యవహరించిన తీరు స్ఫూర్తినిస్తోంది.

వెంకయ్య నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. అనేక విషయాలపై వెంకయ్య పట్టు సాధించారు. సలహాలు, సూచనలు చేసే విషయంలో చక్కగా మాట్లాడతారు. వెంకయ్యనాయుడు మాటల్లోనూ కళాత్మకత ఉంటుంది. ఒక మంచి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటాం. ఇతరులతో ఎలా మాట్లాడాలి, వ్యవహరించాలో వెంకయ్య నుంచి నేర్చుకోవచ్చు. మన మాటలను బట్టే మనం ఎలాంటి వారమో తెలుస్తోంది. అందరితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Rajnath Singh Released venkaiah naidu coffee table book

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News