Monday, April 29, 2024

ఆగస్ట్ 4న హాట్ హాట్ “రాజుగారి కోడిపులావ్”

- Advertisement -
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కోన ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ట్రైలర్ విడుదల అవడంతో సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ రమ్య గిరీష్ మాట్లాడుతూ.. తనకు తెలుగులో మొదటి సినిమా అవకాశమిచ్చిన డైరెక్టర్ శివకోనకి ధన్యవాదాలు తెలిపారు. రాజు గారి కోడిపులావ్ చిత్రీకరణ ఓ సాహసంగా జరిగిందని, ఇది కచ్చితంగా ధమ్ బిర్యాని రుచి అంత బాగుంటుందని పేర్కొన్నారు.
హీరో అభిలాష్ మాట్లాడుతూ.. ముందుగా మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇక డైరెక్టర్ శివ కోన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, రొటీన్ గా ఉండదని, చాలా కొత్తగా మిస్టీరియస్ గా రాజు గారి కోడిపులావ్ ఉంటుందని అన్నారు. ఇది ఓటీటిలో చూసే సినిమా కాదని కచ్చితంగా బిగ్ స్క్రీన్ లోనే చ చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ శివ కోన చాలా కష్టపడ్డారని, ప్రొడక్షన్ మెయింటెనెన్స్ తో పాటు ఆర్టిస్టుల బాగోగులు కూడా దగ్గరుండి చూసుకున్నారని కొనియాడారు. ఇక సినిమా కంటెంట్ ను నమ్మి చిన్న ఆర్టిస్టులైన మాతో చేయడానికి ఒప్పుకున్నందుకు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ ప్రాచీ ఠాకూర్ మాట్లాడుతూ.. ముందుగా టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజు గారి కోడి పులావ్ ఇంత టేస్టీగా ఉండడానికి ముఖ్య కారణం కాస్ట్ స్టాండ్ క్రూ అంతా తమ సినిమా అనుకోని కష్టపడ్డారని తెలిపారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు క్యాండీ అని, మామూలుగా క్యాండీ అంటే రుచికి పుల్లగా, తీయగా, వగరుగా ఉంటుందని తన పాత్ర కూడా అలాగే చాలా వినుత్వంగా ఉంటుందని చెప్పారు. సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడాలని ఎందుకంటే ఇది అద్భుతమైన రుచి కలిగిన వంటకం అన్నారు.
కునాల్ కౌశిక్ మాట్లాడుతూ… 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసినప్పటికీ, సినిమాలు రిలీజ్ అవకా సరైన గురింపు పొందలేకపోయానని తెలిపారు. సినిమా తీయడం ఒక ఎత్తైతే దాన్ని రిలీజ్ చేయడం తలకు మించిన భారమని పేర్కొన్నారు. ఈ విషయంలో డైరెక్టర్ శివ కోనకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఎంత మంచి సినిమా చేసినా.. సినిమా రిలీజ్ కాకపోతే మన శ్రమ అంతా వృధా అని అన్నారు. పరిశ్రమలో చాలామంది కొత్త వాళ్లను ఆదరించరు, వాళ్ళ మోహాళ్ళను ప్రేక్షకులు చూడరు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని… దమ్మున్న సబ్జెక్టుతో మంచి సినిమా తీసి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తారని అందుకు ఉదాహరణ హీరో నాని, విజయ్ దేవరకొండ అని తెలిపారు. ఎన్నో నిద్దర్లు లేని రాత్రులు గడిపి సినిమాను తెరకెక్కించామని ప్రేక్షకులు ఆగస్టు 4న థియేటర్లో సినిమా చూసి ఆదరిస్తారని కోరారు.
ఈ సినిమాకి రచన సహకారం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన రవి మాట్లాడుతూ… సినిమా డైరెక్టర్ శివ కోన తాను చిన్ననాటి స్నేహితులని.. తామిద్దరూ చిరంజీవికి పెద్ద అభిమానులన్నారు. ఆయన సినిమాలు చూస్తూ స్కూల్ ఏజ్ లోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చాలా సంవత్సరాల తర్వాత అమెరికా నుండి శివ ఫోన్ చేసి మనం సినిమా చేస్తున్నామని చెప్పడంతో ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. సినిమా చేయాలి అనుకున్నప్పుడు పరిశ్రమలో ఎవరూ తెలియదని.. కనీసం లైట్ బాయ్ కూడా తెలియదని చెప్పారు.
ఇక పరిశ్రమలో చిన్న సినిమా కదా ఎలాగోలా తీద్దామని శివకోన ఎప్పుడూ అనుకోలేదని… ప్రేక్షకుడు అంత ప్రైజ్ పెట్టి మన సినిమాకు వస్తున్నాడు అంటే అతన్ని కచ్చితంగా సంతృప్తి పరిచేలా కంటెంట్ ను తీర్చిదిద్దాలని అహోరాత్రులు కష్టపడ్డాడని తెలిపారు. శివ కోనకు ఎడిటింగ్ మీద మంచి పట్టు ఉందని సినిమా అవుట్ ఫుట్ పై చిత్ర యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉందని వెల్లడించారు. ఇక సినిమాను సొంతంగా విడుదల చేస్తున్నట్లు దీనికి ధర్మకర్త, ఎన్టీఆర్ శ్రీను ఇద్దరూ ఎంతో సపోర్ట్ చేశారని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేసిన ప్రభాకర్ చాలా బాగా చేశారని, చిన్న సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ… తాను ఈటీవీలో సీరియల్స్ చేస్తున్నప్పుడు ప్రభాకర్ ను దూరం నుండి చూసేదానినని, ఇప్పుడు ఆయనతో నటించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ శివ కోనకు ధన్యవాదాలు తెలిపారు.
రాజు గారి కోడి పులావ్ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించిన ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను చేసింది చిన్న హెల్ప్ అని వీరంతా ఇంతలా పొగడడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమలాంటి వారందరినీ ఆదరించిన ప్రేక్షకులు ఈ యంగ్ అండ్ డైనమిక్ నటులను ఆదరించాలని కోరారు. ముఖ్యంగా ఈ టీమ్ నచ్చి వీరితో ట్రావెల్ చేశానని తెలిపారు. ఇక డైరెక్టర్ శివ కోన గురించి మాట్లాడుతూ.. ఆయనకు విజన్ పాటు, ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిభతో పాటు ఓపిక చాలా ఎక్కువ అని తెలిపారు. కొన్నిసార్లు స్టార్ హోటల్స్ లో బిర్యాని తిన్నదానికన్నా మామూలుగా హోటల్స్ లో తిన్న బిర్యాని చాలా రుచిగా బాగుంటుందని, అలాగే రాజు గారి కోడి పులావ్ కూడా మీకు నచ్చుతుందని తెలిపారు. చిన్న సినిమాను విడుదల చేయడం అంత ఆశామాశి వ్యవహారం కాదని ఈ విషయంలో శివకోన చాలా నేర్పుగా వ్యవహరించాలని అందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
డైరెక్టర్ శివకోన మాట్లాడుతూ… ముందుగా సినిమాను సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కృతజ్ఞతలు చెప్పారు. సినిమాను నమ్మి చిన్న క్యారెక్టర్ అయినా మాకెంతో బ్యాక్ బోన్ గా ఉన్న ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాస్ట్ అండ్ క్రూకు శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు చెప్పారు. చిన్న బడ్జెట్ సినిమాలా లేదని పెద్ద సినిమాలో ఉందని అందరూ అంటున్నారు అంటే దానికి కారణం సినిమా కోసం యూనిట్ అంతా ఎంతో కష్టపడిందని వివరించారు. సినిమాను కచ్చితంగా థియేటర్లోనే ఆగస్టు 4న చూడండి లేదంటే మీరు ఎంతో మిస్ అవుతారని పేర్కొన్నారు. ఈ సినిమాకు పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్ గా, సినిమాకు ప్రాణం అయిన సంగీతాన్ని ప్రవీణ్ మనీ, ఎడిటర్ గా బసవ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా రాజు గారి కోడి పులావ్ ఆగస్ట్ 4న విడుదల కావడానికి రంగం సిద్ధం అయింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News