Monday, April 29, 2024

‘సిద్ధ’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

Ram Charan Teaser from Acharya to release on Nov 28

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ’ఆచార్య‘. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇందులో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ విడుదల కానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నారు. నవంబర్ 28వ తేదీన ఈ టీజర్ ను అభిమానులతో పంచుకోనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా, చరణ్, పూజాలపై తీసిన ’నీలాంబరి‘ పాటను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ‘లాహే లాహే’ పాట 100 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత, రెజీనా ప్రత్యేక పాటలతో అలరించనున్నారు.

Ram Charan Teaser from Acharya to release on Nov 28

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News