Friday, April 26, 2024

మనసు మాత్రం హూ… అంటోంది

- Advertisement -
- Advertisement -

కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోలు దొరికిన సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాకుండా తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉన్న చరణ్ శుక్రవారం ఓ ఆసక్తికర పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తన వర్కవుట్స్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చరణ్ “మెదడు వ్యాయామం చేయమంటోంది.. మనసు మాత్రం హూ… అంటోంది” అని కామెంట్ చేశాడు. ఇక రామ్ చరణ్ కెరీర్ ప్రారంభం నుండి కూడా తన బాడీ ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతూ వస్తున్నాడు. తన సినిమాల్లో కూడా తన శరీర సౌష్టవాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక చరణ్ తాజాగా నటిస్తున్న ’ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్… మన్నెం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ హోమ్ బ్యానర్‌లో చిరంజీ హీరోగా- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందువుతున్న ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News