Monday, May 6, 2024

డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్

- Advertisement -
- Advertisement -

Rana is planning grand wedding ceremony

 

పాన్ ఇండియా యాక్టర్ రానా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి మిహికా బజాజ్‌ని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ 35 ఏళ్ల నటుడు రెండు రోజుల్ క్రితం తన ప్రేయసిని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఓ ఫ్రెండ్ ద్వారా పార్టీలో వీరిద్దరికీ పరిచయం కాగా అది ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లినట్లు తెలిసింది. ఇక వీరి పెళ్లికి పెద్దల అనుమతి కూడా దక్కగా పెళ్లి చేసుకోవడమే తరువాయి. రానా తండ్రి అయిన డి.సురేష్ బాబు లాక్ డౌన్ ముగిసిన అనంతరమే వీరి వివాహం ఉంటుందని చెప్పారు. అది కూడా డిసెంబర్ లోపే వివాహ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రపంచంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరితే గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. వీరు మొదటి ప్రిఫరెన్స్ విదేశాలలో కాగా… కుదరని పక్షంలో ఇండియాలోనే ఓ ఖరీదైన ప్రాంతంలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక వీరి పెళ్లికి బడ్జెట్ కూడా భారీగా కోట్లలో కేటాయించనున్నారని తెలిసింది. సుప్రసిద్ధ నిర్మాత డి.రామానాయుడు పెద్ద మనవడు రానా వివాహం నభూతో నభవిష్యత్ అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News