Sunday, May 12, 2024

కరోనాపై ర్యాపిడ్‌ యాక్షన్

- Advertisement -
- Advertisement -

etela

 

ఎయిర్‌పోర్టులో జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలోకి కరోనా రాదు

రాష్ట్రంలో మూడో కరోనా కేసు, ఇద్దరికీ గాంధీ ప్రత్యేక వార్డులో చికిత్స

ర్యాపిడ్ యాక్షన్ టీంలతో వేగంగా పరీక్షలు : మంత్రి ఈటల ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే కట్టడి చేయగలిగితే రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించదని మంత్రి ఈటల తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రతి వ్యక్తిని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ చేసి, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రవేశించే అవకాశాలు తక్కువని మంత్రి అభిప్రాయపడ్డారు. కరోనాపై అసెంబ్లీలో పలువురు సభ్యుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… చాలా మంది కరోనాపైఅపోహాలకు గురవుతున్నారని, ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుందని ప్రజలకు గుర్తుచేశారు. వికారాబాద్‌లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అక్కడ ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసి అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పర్యవేక్షించేందుకు మాత్రమే ఈ వార్డులు వినియోగించుకుంటామని మంత్రి తెలిపారు.

వైరస్ సోకిన వారికి వికారాబాద్‌లో చికిత్సను ఇవ్వమని, గాంధీ, చెస్ట్ ఆసుపత్రిలో మాత్రమే చికిత్సను అందిస్తామని మంత్రి వెల్లడించారు. కరోనా వైరస్ పై ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ భారీన పడకుండా ఉండవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. తుమ్ములు వచ్చినప్పుడు తువ్వాలు అడ్డుపెట్టుకొని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటే కరోనా విస్తరించదని మంత్రి తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కావున ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. అసెంబ్లీ నుంచి వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావులతో మంత్రి ఆదివారం ఫోన్‌లో మాట్లాడి కరోనా పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇతర దేశాల నుంచి వస్తున్న వారి నుంచి కరోనా వస్తున్న నేపథ్యంలో వెంటనే ఎయిర్‌పోర్ట్‌ను దిగ్భంధం చేయాలని, ఒక్కరిని కూడా స్క్రీన్ చేయకుండా బయటకు పంపవద్దని ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారిని మంత్రి కోరారు. కరోనా సందర్భంలోనే కాకుండా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాంధీ, ఉస్మానియా, చెస్ట్, ఫీవర్ హాస్పిటల్స్‌లోనూ కరోనా నియంత్రణ కోసం సర్వం సిద్ధంగా ఉంచాలని మంత్రి కోరారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన ఇద్దరు వ్యక్తులను కలసిన వారిని వెంటనే ట్రాక్ చేయాలని, వారిని కూడా క్వారంటైన్ చేయాల్సిందిగా మంత్రి అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రివాక్స్ అవ్వోద్దని మంత్రి అధికారులకు చెప్పారు.

 

Rapid Action on Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News