Friday, May 17, 2024

గురువారం రాశి ఫలాలు (23-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు కొనుగోలు.

వృషభం – విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. గృహ, నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం – రుణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు.

కర్కాటకం – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది.

సింహం – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాతమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. సంధానం నాకు నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహన యోగం.

కన్య – వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. సోదరుల నుండి శుభఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం.

తుల – బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. ప్రయాణాలు రద్దు చేసుకొంటారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. సోదరుల నుండి సహాయసహకారాలు అందుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

వృశ్చికం – శ్రమ ఫలిస్తుంది. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వాహన కొనుగోలు.

ధనుస్సు – నూతన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

మకరం – రుణ బాధల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కుంభం – ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఆభరణాల కొనుగోలు చేస్తారు.

మీనం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానంనకు సాంకేతికవిద్యావకాశాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News