Monday, April 29, 2024

తొలి టెస్టులో అక్కడే తప్పిదం జరిగింది: రవి శాస్త్రి

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించారు. సౌతాఫ్రికా జట్టును త్వరగా ఆలౌట్ చేస్తే బాగుండేదన్నారు. రోహిత్ శర్మ పేస్ బౌలర్లను మంచి ఉపయోగించుకోలేదని చురకలంటించారు. సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు కొత్త బౌలర్లను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. రెండో రోజు బ్రేక్ సమయానికి సఫారీలు ఒక వికెట్ కోల్పోయి 49 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో సెషన్ ప్రారంభంకాగానే ప్రసిద్ధ కృష్ణ, శార్థూల్ ఠాకూర్‌తో బౌలింగ్ చేయించడం సరికాదన్నారు.

ఓపెనింగ్ స్పెల్‌తోనే బౌలింగ్ చేయించాలని సూచించారు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు చాలా సార్లు అలానే చేశానని రవి వివరించారు. రెండో సెషన్‌లో చేసిన అతిపెద్ద పొరపాటు ఇదేనని చెప్పారు. రెండో సెషన్‌లో బుమ్రా, సిరాజ్‌ను తప్పించి మరో ఇద్దరు బౌలర్లతో బౌలింగ్ చేయించడంతోనే తప్పు జరిగిందని టీమిండియా మాజీ ఆటగాడు మంజ్రేకర్ తెలిపారు. బ్రేక్ సమయంలో రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ మాట్లాడుకునే ఇలా చేసి ఉంటారని చెప్పారు. బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి మరో బౌలర్‌తో రోహిత్ బౌలింగ్ చేయించాడని సౌతాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ మద్దతు పలికాడు. లంచ్ తరువాత సఫారీ బ్యాట్స్‌మెన్లు 42 పరుగులు పిండుకొని ఇన్నింగ్స్‌కు మంచి రూపం తీసుకొచ్చారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News