Monday, April 29, 2024

ఐఎంపిఎస్ పరిమితిని పెంచనున్న ఆర్ బిఐ

- Advertisement -
- Advertisement -

IMPS

ముంబయి: డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) ‘త్వరితగతిన చెల్లింపు సేవ’(ఐఎంపిఎస్) లావాదేవీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని శుక్రవారం ప్రతిపాదించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) ఈ ఐఎంపిఎస్ నిర్వహిస్తోంది. దేశీయంగా నిధుల బదలాయింపు వసతిని 24 x 7 పాటు(నిరంతరం) ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, బ్యాంక్ బ్రాంచీలు, ఏటిఎంలు, ఎస్‌ఎంఎస్, ఐవిఆర్ ద్వారా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపిఎస్) అందిస్తోంది.
ఇప్పుడు ఆర్‌టిజిఎస్ నిరంతరం పనిచేస్తున్నందున ఐఎంపిఎస్ సెటిల్‌మెంట్లు కూడా పెరిగాయి. కొత్త పేమెంట్స్ యాక్సెప్టెన్స్(పిఏ) మౌలికవసతికి జియో-ట్యాగింగ్ టెక్నాలజీ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. అంటే ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ సేల్(పిఓఎస్) టర్మినళ్లు, క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ల వంటివాటికన్నిటికీ దేశవ్యాప్తంగా జియో-ట్యాగింగ్ అనుసంధానించనున్నారు. పిఏ మౌలికవసతిని వినియోగిస్తునందుకు పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(పిఐడిఎఫ్)ను రిజర్వు బ్యాంకు అభినందించింది.
ఇదిలా ఉండగా, ‘రిటైల్ పేమెంట్స్’, ‘క్రాస్ బార్డర్ పేమెంట్స్’, ఎంఎస్‌ఎంఇ లెండింగ్’కు రెగ్యులేటరీ శాండ్‌బాక్స్(ఆర్‌ఎస్)ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్థిక మోసాలను నిరోధించే నాలుగో కోహోర్ట్(cohort)ను కూడా ప్రకటించనున్నామని ఆయన తెలిపారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ మోడ్‌లో రిటైల్ డిజిటల్ పేమెంట్స్‌కు ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బిఐ ప్రతిపాదించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News