Monday, April 29, 2024

విలన్ పాత్రలో రెజీనా

- Advertisement -
- Advertisement -

Regina as villain role in chakra movie

 

తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘చక్ర’. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. గతంలో వరలక్ష్మిని తన ఒక సినిమాలో విలన్ గా నటింపజేసిన విశాల్ ఈసారి మరో లేడీ విలన్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ‘చక్ర’ చిత్రంలో విలన్ పాత్రలో రెజీనా నటిస్తుందట. ఇప్పటి వరకు ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. తమిళ మీడియాలో మాత్రం ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు రెజీనా నటన హైలైట్‌గా ఉంటుందని కూడా వారు అంటున్నారు. విశాల్‌కు జోడీగా శ్రద్దా శ్రీనాధ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ప్రమోషన్‌లో, వీడియోల్లో రెజీనా ఈ చిత్రంలో నటించిన విషయాన్ని తెలియచేయకుండా సస్పెన్స్‌ను కొనసాగించాలనుకుంటున్నారట. సినిమా సెకండ్ హాఫ్ వరకు విలన్ ఎవరు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగి ఆ తర్వాత విలన్ రెజీనా అంటూ చెబుతారట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News