Friday, May 3, 2024

రెపోరేటు, రివర్స్ రెపోరేటు యథాతథం…

- Advertisement -
- Advertisement -

RBI is working on digital currency

ముంబయి: వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని ఆర్‌బిఐ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.3 శాతంగానే ఉంచింది. ఐదో సారి వడ్డీ రేట్ల యథాతథంగా ఆర్‌బిఐ  ఉంచింది. 2021-22 జిడిపి వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో సర్దుబాటు వైఖరినే అవలంభించామన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ధరల స్థిరత్వం, వృద్ధి, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై ఆర్‌బిఐ దృష్టి పెట్టిందన్నారు. కరోనా వైరస్‌ను విస్తరించకుండ చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్థిక వృద్ధి పునరుత్తేజంతో అస్థిరతను పెంచాలని శక్తి కాంత దాస్ సూచించారు. 2021 ప్రథమార్థంలో ద్రవ్యోల్బణం ఉండొచ్చని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది. మూడో త్రైమాషికం నాటికి 4.4 శాతంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News