Monday, May 6, 2024

పుదుచ్చేరి, జమ్మూ కశ్మీరు అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -

రెండు బిల్లులకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: పుదుచ్చేరి, జమ్మూ కశ్మీరు అసెంబ్లీలకు మహిళా రిజర్వేషన్ బిల్లు నిబంధనలను వర్తింపచేసే రెండు బిల్లులను రాజ్యసభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. డిసెంబర్ 13న పార్లమెంట్‌లో జరిగిన భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభ మధ్యలోకి దూసుకువెళ్లి నినాదాలు చేస్తుండగా గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బిల్లు, జమ్మూ కశ్మీరుపునర్వవస్థీకరణ బిల్లు(రెండవ సవరణ) రాజ్యసభలో ఆమోదం పొందాయి.

ఈ రెండు బిల్లులు డిసెంబర్ 12న లోక్‌సభలో ఆమోదం పొందాయి. రాజ్యసభలో ఉదయం సెషన్ రెండు సార్లు వాయిదా పడగా మధ్యాహ్నం 2 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ రెండు బిల్లులను సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులు మహిళల హక్కులకు అనుకూలమైనవని ఆయన అన్నారు. ఈ దశలో ప్రతిపక్ష సభ్యులు మళ్లీ తమ డిమాండునులేవనెత్తగా అధికార పక్ష సభ్యులతోపాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు సభ్యులు కూడా బిల్లులకు అనుకూలంగా సభలో మాట్లాడారు.

బిల్లులకు అనుకూలంగా మాట్లాడిన ఎంపీలలో వి విజయసాయి రెడ్డి(వైఎస్‌ఆర్‌సిపి),కవితా పాటిదార్(బిజెపి), ఎం తంబిదురై(ఎఐఎడిఎంకె), ఎస్ ఫంగ్‌నన్ కోన్యక్(బిజెపి), కనకమేడల రవీంద్ర కుమార్(టిడిపి), రాకేష్ సిన్హా(నామినేటెడ్), జగ్గేష్(బిజెపి), బీరేంద్ర ప్రసాద్ బైశ్య(అస్సాం గణ పరిషద్) ఉన్నారు. సాధ్యమైనంత త్వరితంగా జమ్మే కశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కొందరు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్(సవరణ) బిల్లులో నిర్దేశించిన ప్రకారం మొత్తం స్థానాలలో మూడింట ఒరవంతు స్థానాలను పుదుచ్చేరి శాసనసభలో(షెడ్యూల్డ్ కులాలమహిళలకు కేటాయించిన సీట్లతో కలుపుకుని) ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.

జమ్మూ కశ్మీరు అసెంబ్లీలో మహిళలకు సీట్లను రిజర్వ్ చేయాలని జమ్మూ కశ్మీరు పునర్వస్థీకరణ(రెండవ సవరణ) బిల్లు నిర్దేశిస్తోంది. జమ్మూ కశ్మీరు అసెంబ్లీలోని మొత్తం స్థానాలలో మూడింట ఒక వంతు సీట్లను ఎస్‌సిలు లేదా ఎస్‌టి మహిళలకు కేటాయించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ఈ నిబంధనలను జమ్మూ కశ్మీరు పునర్వవస్థీకరణ చట్టం, 2019లో పొందుపరచవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News