Saturday, May 4, 2024

రెడ్‌జోన్‌లో ఆంక్షలు కఠినం

- Advertisement -
- Advertisement -
Restrictions on Redzone are stringent
ప్రజలు రోడ్లపైకి రాకుండా పకడ్బందీ చర్యలు
ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం
అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు

మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.

గత పదిరోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం వైరస్ వేగం విస్తరించే ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి లాక్‌డౌన్ అంక్షలు కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేటితో కేంద్ర విధించిన మూడో లాక్‌డౌన్ పూర్తిగా కావడంతో గతంలో ఇచ్చిన సడలింపులతో ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఇష్టానుసారంగా తిరుగుతూ ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు ఏకంగా పుట్టినరోజు వేడుకలు, వివాహవేడుక దినోత్సవం అంటూ ఘనంగా జరుపుకుంటూ వైరస్ వ్యాపించేలా చేస్తున్నారు. దీంతో ఒక్కొ కుటుంబంలో 10 నుంచి 20మందికి వైరస్ సోకి ఆసుపత్రిలో చేరుతున్నారు.

వీరికి తోడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి స్వస్దలాలకు వస్తుండటంతో కరోనా ప్రతాపం చూపుతుంది. ఇప్పటివరకు 120 మందికి వలస కూలీలు ఆసుపత్రులో చికిత్సలు పొందుతున్నారు. నగరంలో లాక్‌డౌన్ ఇదే విధంగా సడలింపులు ఇస్తే గ్రేటర్‌లో 900కు చేరువలో ఉన్న పాజటివ్ కేసులు పక్షం రోజుల తరువాత కేసుల సంఖ్య 1500 దాటవచ్చని వైద్యులు భావిస్తున్నారు. మే మాసం ప్రారంభం నుంచి మిగతా జిల్లాలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గి గ్రీన్ జోన్లలోకి వెళ్లారు. రాజధాని నగరంలో పెరుగుతున్న కేసులతో కనీసం ఆరెంజ్ జోన్‌లోకి వచ్చే పరిస్దితి లేదని అంటున్నారు. నగరంలో మద్యం అమ్మకాలు, ప్రైవేటు దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలైన రిజిస్ట్రేషన్, ఆర్టీఏ ఆపీసులు తెరవడంతో ప్రజలంతా తాము సొంత పనుల మీద వెళ్లుతున్నామని పోలీసులకు సమాధానం చెబుతూ దర్జాగా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్ వినియోగించాలని వాహనదారులకు పలుమార్లు సూచించిన నిర్లక్షం చేస్తూ వైరస్ వ్యాప్తికి కారకులైతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఈనెల 29వరకు లాక్‌డౌన్ ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా మే 31వరకు ప్రకటించింది. ఈనేపథ్యంలో పోలీసులు రోడ్లపైకి వచ్చిన ప్రజల పట్ల మరింత కఠినంగా వ్యహరించనున్నారు. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు పూర్తిగా రాకపోకలు నిషేదమని చెప్పారు. సాప్ట్‌వేర్ కార్యాలయాలు, ఆటోమొబైల్, ఎసీ,ఎలక్ట్రానిక్ పరికరాల సంస్దలు ప్రారంభమయ్యాయి. ఈనేపధ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News