Friday, April 26, 2024

సింగరేణి భూగర్భ బొగ్గు గనిలో కూలిన పైకప్పు…

- Advertisement -
- Advertisement -

Roof collapse in Singareni underground coal mine

 ప్రమాదంలో చేతి వేళ్లు కోల్పోయిన కార్మికుడు
 గనుల్లో రక్షణ శూన్యమని నేతల ఆరోపణలు

గోదావరిఖని : సింగరేణి ఆర్జీ 1 పరిధి జిడికె 1వ ఇంక్లయిన్ భూగర్భ బొగ్గు గనిలో శనివారం పైకప్పు కూలింది. మార్నింగ్ షిఫ్ట్ సమయంలో ఒక్క సారిగా భారీ శబ్ధంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడే రూఫ్ బోల్ట్ చేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు గంపల శ్రావణ్ ఈ ఘటనలో గాయపడ్డాడు. హుటాహుటిన గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి శ్రావణ్‌ను తరలించారు. శ్రావణ్ తన కుడి చేతి మూడు వేళ్లను పూర్తిగా కొల్పోయిన్నట్లు వైద్యులు తెలిపారు.

గనుల్లో రక్షణ చర్యలు సరిగ్గా చేపట్టక పోవడం మూలంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలు కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కాగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రావణ్‌ను హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, ఆర్జీ 1 వైస్ ప్రెసిడెంట్ తోట వేణు పరామర్శించారు. శ్రావణ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు డాక్టర్లను కోరారు. సింగరేణి అధికారులు బొగ్గు ఉత్పత్తికి చూపించి శ్రద్ధ రక్షణ చర్యలు తీసుకోవడంలో మాత్రం అవుతున్నారని రియాజ్ ఆరోపించారు. కార్మికులను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన పనులు చెబుతూ ఇబ్బందులు పెడుతూ వారిని ప్రమాదాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పరామర్శించిన వారిలో నాయకులు చందర్ రావు, తూడి రామస్వామి, బేగ్, కుమార్, డేవిడ్ తదితరులున్నారు.

Roof collapse in Singareni underground coal mine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News