Saturday, April 27, 2024

ఆర్టీఏకు… అద్దె భవనాలే దిక్కు

- Advertisement -
- Advertisement -
RTA offices are housed in rented buildings
పార్కింగ్ స్థలాలులేని ఈస్ట్, వెస్ట్ జోన్
కార్యాలయాలు
– ఇబ్బందిపడుతున్న వాహనదారులు

హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయన్ని తీసుకు వచ్చే నగరంలోని కొన్ని ఆర్టిఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ఇటు అధికారులు అటు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో అధికారులు త మ విధి నిర్వాహణలో కూడా అనేక ఇబ్బందులు ప డుతున్నారు. ఆయా కార్యాలయాల ముందు తగినంత పార్కింగ్ సౌకర్యం లేక పోవడంతో అటు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా తమ వాహనా లు కార్యాలయం బయట నిలుపుతుండటంతో నో పా ర్కింగ్ ప్లేస్‌లో వాహనాలను నిలిపారంటూ ట్రా ఫిక్ పోలీసులు భారీ ఎత్తును ఛలనాలు విధిస్తున్నా రు. రవాణాశాఖలో పనులు ముగించుకుని బయట కు వ చ్చే సరికి తమ వాహనాలు కనపడక పోవడంతో వా హన దారులు ఆందోళకు గురవుతున్నారు. తమ వా హనాలు ట్రాఫిక్ పోలీసులు తీసుకు పోవడంతో వాటిని విడిపించుకునేందుకు వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించకుం డా ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడం ఏమిటని వారు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మలక్‌పేట,(ఈస్ట్‌జోన్), టోలీ చౌకీ(వెస్జ్‌జోన్) కార్యాలయాలకు వివిధ పనులు నిమి త్తం వచ్చే ప్రజలు ఆయా కార్యాలయాలముందు వా హనాలు నిలపడంతో ట్రా ఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఈస్ట్, వెస్ట్ జోన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేక పోవడ మే ఇందుకు ప్రధాన కార ణం అవుతున్నాయి. అద్దెభవనాల్లో ఆర్టిఏ కార్యాయాలు కొనసాగుతుండటంతో పార్కింగ్ సమస్యలు వస్తున్నాయి. వీటికి సొంత భవనాలు కేటాయించాలని అధికారులు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నా అది సాధ్యం కావడం లేదు. టోలీచౌకీ లోని కార్యాలయం కోసం ఇబ్రహీంబాగ్‌లో 11 ఎకరాలు స్థలాన్ని అధికారులు పరిశీలించి ఈ స్థలాన్ని వెస్ట్‌జోన్ కార్యాలయానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసున్నట్లు సమాచారం. అదే వి ధ ంగా మలక్‌పేట కార్యాలయం కోసం చంచల్‌గూడ జైలు ప్రాంతంలో 5 ఏకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించిన అధికారులు దాంతో పాటే రామాంతపూర్ ఐటీఐ ప్రాంతం లో ఉన్న ఖాళీస్థలాన్ని అధికారులు కోరుతున్నట్లు స మాచారం. గతంలో ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు నాటి రవాణావాఖ మంత్రి ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంతో పాటు మలక్‌పేట, టోలీ చౌకీ కార్యాలయాలను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News