Monday, April 29, 2024

శబరిమల వెళ్ళే భక్తుల కోసం స్సెషల్ బస్సులు ఏర్పాటు చేసిన ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -

RTC set up special buses for devotees going to Sabarimala

 

హైదరాబాద్ : శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత సంత్సరం కరోనా కారణంగా బస్సులను ఏర్పాటు చేయని అధికారులు ప్రస్తుతం కరోనా అదుపులో ఉండి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచకుని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ డిపో 1 ఆధ్వర్యంలో అద్దెప్రాతిపదికన బస్సులను సిద్దం చేసినట్లు చెబుతున్నారు. 30 సీట్ల సామర్థం గల సూపర్ లగ్జరీబస్సుకు కిలో మీటర్‌కు రూ.48.96లను అదే విధంగా 40 సీట్ల సామర్థ్ంయం గల డీలక్స్ బస్సుకు కిలో మీటర్‌కు 47.20 చార్జీలు వసూలు చస్తుండగా 48 సీట్ల సామర్థం గల డీలక్స్ బస్సుకు కిలో మీటర్‌కు రూ.56.64 చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. 49 సీట్ల సామర్థం గల ఎక్స్‌ప్రెస్ బస్సుకు కిలో మీటర్‌కు రూ.52.43 లను చార్జీలుగా వసూలు చేస్తున్నామని తెలిపారు. వెయిటింగ్ చార్జీల కింద గంటకు రూ.300 చెల్లించాల్సి ఉంటుందన్నారు. శబరిమల వెళ్ళే భక్తులు బస్సులను బుకింగ్ చేసుకునేందుకు ఫోన్ నెం ః 9959226248, లేదా 7382837218 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News