Monday, April 29, 2024

గ్రామాల రూపు రేఖలను మార్చిన పల్లె ప్రగతి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవంను గురువారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిన తరువాత గ్రామ రూపురేఖలు మారాయన్నారు. పల్లెలు గ్రామ స్వరాజ్యమే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి కార్యక్రమానికి చేపట్టిన తరువాత గ్రామ రేపురేఖలు మారాయన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని పల్లెలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధ్ది చేసేందుకు గ్రామ స్వరాజ్యమే ముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమానికి అంకుర్పారణ చేశారన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు అభివృద్ధి చెందడంతో పాటు పారిశుద్ధ్ద మెరుగుపడిందన్నారు. పల్లెల్లో ప్రభుత్వం రాష్ట్రంలోని 12, 769 గ్రామాలను 100 శాతం ఓడిఎఫ్ ఫ్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్‌ను సాధించిందన్నారు. తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకున్నారని తెలిపారు. నర్సరీ, డంపింగ్, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, వైకుంఠదామాలు, క్రీడా స్థలాలు, గ్రామాలు స్వయంగా సమృద్దితో ఎదిగాయని,దశాబ్ది ఉత్సవం వేళ కొత్త ఉత్సహంతో నిండాయన్నారు.

పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయని, స్వచ్చమైన తాగునీటితో నిండిన చెరువులతో కాళేశ్వరం సాగునీటితో పచ్చని పంట పొలాలతో పరిశుభత్ర వాతావరణంలో పల్లె మళ్లీ వికసించిందని దశాబ్ది ఉత్సవాలను దర్జాగా నిర్వహించుకుంటుందన్నారు. అనంతరం గ్రామ పరిశుద్ద సిబ్బందిని సత్కరించారు. జిల్లాలో ముజ్గి గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు పొందిన సందర్బంగా మంత్రి జిల్లా పాలనాధికారి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రవంతి, డిపిఓ శ్రీలత, ఎంపీపీ రామేశ్వర్, ఎంపిటిసిఉ, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News