Friday, April 26, 2024

రాష్ట్రంలో ప్రారంభమైన రైతుబంధు పండుగ

- Advertisement -
- Advertisement -

తొలి రోజు ఎకరం లోపు ఉన్న రైతుకు రైతుబంధు
16,95,601 రైతుల ఖాతాల్లో రూ.516.96 కోట్లు
నేడు రెండెకరాలు కలిగిన రైతులకు నగదు
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో పండుగ వాతావరణం
సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతల వెల్లువ

Rythu bandhu money give to farmers

మన తెలంగాణ/హైదరాబాద్: ఒక కులానికో.. ఒక మతానికో పండగలొస్తుంటాయి. అవి కూడా ఏడాది ఒక్కసారే వస్తుంటాయి..తె లంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు అన్ని కులాల వారికి ముఖ్యమం త్రి కెసిఆర్ రైతుబంధు పథకాన్ని పండగలా మలచారు. అది కూడా ఏడాదికి రె ండు సార్లు ఈ పండగను రాష్ట్రమంతటా లక్షలాది కుటుంబాలు ఎంతో సంబరంగా జరిపేలా చేసిన ఘనత దేశంలో మరే రా ష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కెసిఆర్ వల్లనే సాధ్యపడింది. రాష్ట్రం లో వానాకాలపు  పంటసాగుకు సంబంధించి వ్యవసాయరంగానికి రైతుబంధు పథకం నిధుల పం పిణీకి ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టింది. ఎకరానికి రూ.5000చొప్పు న నగదు బ్యాంకుల్లో జమ కాగానే రైతుల మోబైల్ ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజ్‌ల వరద ప్రారంభమైంది. పోన్లో వచ్చిన రైతుబంధు మెసేజ్‌లను ఇంటిళ్లిపాదికి చూపుతు రైతుతోపాటు అయన కుటుంబమంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురి పేర్లమీద పొలాలు ఉండటంతో తొలిరొజే ఒక్కో రైతు పేరుతో బ్యాంకుల్లో నిధులు జమ అయ్యాయి. తొలకరి వర్షాలకు నేల పదునెక్కుతుండటంతో రైతులు పంటల సాగుపై దృష్టిపెట్టారు. ఇప్పటికే దుక్కులు దున్ని పెట్టిన రైతులు పత్తి, కంది, మిరప విత్తనం వేసేందుకు సన్నద్దమవుతున్నారు. విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసే పనుల్లో నిమగ్న మవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో విత్తన డీలర్ అరువుపై ఏదిస్తే అదే విత్తనం చెప్పిన ధరకు కొనుగోలు చేసి పంటలు సాగు చేసేందుకు దశాబ్ధాల తరబడి అలవాటు పడిన రైతులకు కెసిఆర్ సర్కారు కొండంత అండగా నిలిచింది.రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందచేసిన నగదు సాయంతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు బీజం పడింది. అరువుల బతుకులకు స్వస్తి చెబుతున్న రైతాంగం రైతుబంధు నగదు చేతిలో పెట్టుకుని పదిషాపులు తిరిగి నచ్చిన విత్తనం నచ్చిన ధరలకు బేరమాడి కొనితెచ్చుకునే అవకాశం కల్గిం ది. ఆదేదో బంగారం కొనుగోలు షాపులో చేతిలో డబ్బుంటే మీరే బాసు.. ఇలా కాలుమీద కాలేసుకుని దర్జాగా కూచోవచ్చని టీవీలో సినినటి ప్రకటనలా ఇప్పు డు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలోనూ రైతుబంధు నగదు సాయం ద్వారా కొండంత ఆత్మస్థైర్యంతో వ్యవహరించగలుగుతన్నుట్టు రైతులు చెబుతున్నారు.
తొలిరోజు రూ.516కోట్లు జమ
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద మంగళవారం నాడు రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం రూ.516.95కోట్లు జమ చేసింది. ఆయా బ్యాంకుల ద్వారా 16.95లక్షల మంది రైతుల ఖాతాకు నిధులు జమ చేశారు. ఒక్క ఎకరం పొలం వున్న రైతులతో నగదు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు 10,33,915ఎకరాలకు సంబంధించిన 16,95,610మంది రైతుల ఖాతాలకు నిధులు జమ చేశారు. ఉదయం 11గంటలకే బ్యాంకుల నుంచి రైతుల సెల్ ఫోన్లకు నగదు జమ మేసేజ్‌ల వరద ప్రారంభమైంది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 1,11,970మంది రైతుల ఖాతాల్లోకి రూ.36.60కోట్లు జమచేశారు. అత్యల్పంగా అదిలాబాద్ జిల్లాలో 9628మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60లక్షలు జమ చేశారు.
నేడు రెండెకరాల రైతుకు నగదు
రైతుబంధు పథకం కింద బుధవారం నాడు రెండు ఎకరాలు ఉన్న రైతులకు నగదు పంపిణీ కానుంది. రాష్ట్రంలో రెండు ఎకరాలవరకే పొలం ఉన్న వారిలో మొత్తం 23.05లక్షల ఎకరాలకు సంబంధించి 15.07లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.85.23కోట్లు జమ చేయనున్నారు. ఈనెల 25నాటికి రైతుబంధు పథకానికి అర్హతగల రైతులందరి ఖాతాలకు నగదు జమ చేసేలా చర్యలు చేపట్టారు.
అభినందనల వెల్లువ : మంత్రి నిరంజన్ రెడ్డి
రైతుబంధు పథకం కింద నగదు సాయం పొందుతున్న రైతుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభినందలు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైతుబంధు పథకాన్ని రాష్ట్ర రైతాంగం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ణతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వ్యవసాయ ,ఆర్ధిక శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. వానాకాలపు పంటసాగుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News