Sunday, April 28, 2024

గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ సాయిచంద్ అంతిమ గడియల్లో అవమానం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: దళిత సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్, ప్రజా గాయకుడు సాయిచంద్ అంత్యక్రి యలు అధికార లాంఛనాలతో నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించడం ఎంత వరకు సమంజసమని జాతీయ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎం వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు అబిడ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని సినీనటుడు హరికృష్ణ, నిర్మాత రామానా యుడు మృతదేహాలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం, మలి దశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను చైతన్యపర్చి, ఉద్యమంలో భాగస్వాములను చేసిన వేద సాయిచంద్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించక పోవడం దళిత సామాజిక వర్గాలపై ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు.

సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ, దళిత, బడుగు, బలహాన వర్గాల అణచి వేత చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. దళిత ప్రజా ప్రతినిధుల అంత్యక్రియలను ప్రభు త్వ లాంఛనాలతో నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం దళిత సామాజిక వర్గాన్ని అవమానించి, దళిత ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తుందని మ ండిపడ్డారు. దళిత సామాజిక వర్గాలను అవమానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ దళిత సమాజం సిద్దం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News