Saturday, April 27, 2024

అంబరాన్నంటిన చెరువు సంబురం

- Advertisement -
- Advertisement -

కల్లూరు : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రగతిని చాటుతూ దేశం గర్వించేలా చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికలతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సహా ఎంతో గొప్పగా కన్న తల్లి లాంటి చెరువు యొక్క గొప్పతనాన్ని చాటి దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొల్పిందని కల్లూరు ఎంపీపీ రఘు అన్నారు.

గురువారం కల్లూరు మండల పరిధిలోని 31 గ్రామ పంచాయతీలలో ఊరు వాడ కలసి మెలసి పండుగ వాతావరణ నెలకొల్పేలా చెరువుల వద్ద చెరువు యొక్క గొప్పతనాన్ని చాటుకునే దిశగా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరూ కన్నతల్లి లాంటి చెరువుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న గొప్ప రోజు ఇటువంటి ఐక్యతకు నిలయంగా అన్ని గ్రామాలలో సామూహిక సహపంక్తి భోజనాలను ఆయా గ్రామపంచాయతీ సర్పంచులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రజల సహకారాలతో గ్రామాలలో పండుగ వాతావరణాన్ని చాటుకున్న తెలంగాణ ఘన కీర్తిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే భాగ్యాన్ని కల్పించారని కల్లూరు జడ్పిటిసి కట్ట అజయ్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, మండల ఎంపీడీవో బి.రవికుమార్, ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్, ఎంపీటీ సి లు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News