Friday, May 17, 2024

2025 చివరికల్లా ‘సముద్రయాన్’

- Advertisement -
- Advertisement -

సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత దేశం చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ ‘ సముద్రయాన్’ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. ఇందులో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టనుంచి ఆరువేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధనలు జరుపుతారని ఆదివారం పిటిఐకిచ్చిన ఓ వీడియో ఇంటర్వూలో మంత్రి తెలిపారు. ‘ దీనికోసం ‘మత్స’ అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లో ఆరువేల మీటర్ల లోతుకు ప్రయాణిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి. 2025 చివరికల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని రిజిజు చెప్పారు.

సముద్ర జలాల్లో వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం 2021లో కేంద్రప్రభుత్వం ‘సముద్రయాన్ ’ప్రాజెక్టును ప్రకటించింది. మత్స జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో తయారు చేస్తున్నారు. ఇందులో ఆధునిక సెన్సర్లు, టూల్స్ ఉంటాయి. ఇది 12 గంటలు పని చేస్తుంది. అత్యవసర సమయాల్లో దీని సామర్థాన్ని 96 గంటలకు పెంచవచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, జపాన్ దేశాలు ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాయి. సముద్రయాన్‌ను విజయవంతంగా చేపట్టడం ద్వారా భారత్ ఆ దేశాల సరసన చేరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News