Friday, May 3, 2024

సంజయ్‌దత్ ఆరోగ్యంపై ఆందోళన అక్కరలేదు..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు వైద్య చికిత్స జరుగుతోంది. వైద్య చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని ఆందోళన చెందవలసిందేమీ లేదని కుటుంబ సభ్యులు ఒకరు తెలిపారు. 61 ఏళ్ల సంజయ్‌దత్ తాను నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి వైద్యచికిత్సపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు గత ఆగస్టులో ఆయన వెల్లడించారు. ఆయన క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు నెల నుంచి ఆరు నెలలకు మించి జీవించరని వార్తలు ప్రచారం అయ్యాయని, కానీ అలాంటిదేమీ లేదని వివరించారు. ఈరోజు ఆయనకు పరీక్షలు జరిగాయని, ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.

Sanjay Dutt’s Family denied Rumours on his Health

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News