Monday, April 29, 2024

కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్‌లో వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Corona vaccine will be available in UK from 2021

 

లండన్ : కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. క్రిస్మస్ ముగిసిన వెంటనే జనవరి నుంచి అందుబాటులోకి తీసుకురాడానికి సిద్ధం కావచ్చని బ్రిటన్ ఆరోగ్య రంగ నిపుణులు అక్కడి పార్లమెంటు సభ్యులకు తెలియచేసినట్టు స్థానిక మీడియా వర్గాల కథనం. ఏ వ్యాక్సిన్ అయినా మూడు దశల ప్రయోగాలను తప్పనిసరిగా నిర్వహించ వలసి వస్తుందని, ప్రజలకు సరఫరా చేసే ముందు నియంత్రణ సంస్థలు వాటి ఫలితాలను విశ్లేషించి అనుమతిస్తాయని, అది ఎంతో దూరంలో లేదని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జొనాథన్ వాన్‌టాన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సమర్ధంగా,సురక్షితంగా ఉన్నట్టు నియంత్రణ సంస్థ ప్రకటించిన వెంటనే విడుదల చేయడానికి ఎంహెచ్‌ఆర్‌ఎ సన్నధ్ధమవుతుంది. వ్యాక్సిన్‌కు లైసెన్స్ మంజూరు చేసే ఏజెన్సీల అవసరం లేకుండానే నేరుగా ప్రజలకు అందించడానికి హ్యూమన్ మెడిసిన్ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. అయితే ప్రయోగాల్లో కచ్చితమైన ప్రమాణాలు పాటించిన తరువాతనే వ్యాక్సిన్లకు అనుమతిస్తామని ఎంహెచ్‌ఆర్‌ఎ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ క్రిస్టియన్ ప్నైడర్ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News