Saturday, April 27, 2024

 2021లో శశికళకు విముక్తి..

- Advertisement -
- Advertisement -

 2021లో శశికళకు విముక్తి.. పదికోట్ల ఫైన్‌కడితే జనవరి 27నే విడుదల

బెంగళూరు: జయలలిత నెచ్చెలి వికె శశికళ వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన విడుదల కావచ్చు. ఈ విషయాన్ని కర్నాటక జైళ్ల శాఖ మంగళవారం తెలిపింది. అవీనితీ అభియోగాల నిర్థారణ కావడంతో శశికళ నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల చక్రం తిప్పిన శశికళ 2021లొ విముక్తి పొందుతుందని చాలాకాలంగానే ప్రచారం జరుగుతోంది. ఆమె పదికోట్ల రూపాయల మేర ఫైన్ మొత్తం చెల్లిస్తే జనవరి 27వ తేదీన విడుదల అయ్యేందుకు వీలుందని ప్రిజన్స్ అధికారి ఒకరు తెలిపారు. శశికళ ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని పరాప్పన అగ్రహార ప్రిజన్‌లో ఉన్నారు. ఆదాయానికి మించిన రూ 66 కోట్ల ఆస్తుల కేసుకు సంబంధించి ఆమెకు 2017 ఫిబ్రవరిలో శిక్ష పడింది. ప్రిజన్స్ రికార్డుల ప్రకారం ఆమె ఖైదీ నెంబర్ 9234గా ఉన్నారు. పది కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గౌరవనీయ న్యాయస్థానం తెలిపిందని, దీనిని చెల్లించినట్లు అయితే జనవరిలో విడులకు వీలుందని సెంట్రల్ ప్రిజనన్ సూపరింటెండెంట్ ఆర్ లతా ఓ ఆర్టీఐ అర్జీకి స్పందిస్తూ తెలిపారు. ఫైన్ చెల్లిస్తే జనవరిలో విడుదల ఉంటుంది. లేకపోతే ఫిబ్రవరి 27వ తేదీన విడుదల అవుతారని వివరించారు.

అయితే, శశికళ విడుదల ఈ నెల చివరిలోనే ఉంటుందని ఆమె తరఫు లాయర్లు ఆశిస్తూ వస్తున్నారు. సత్ప్రవర్తన కారణంగా ఆమె ముందస్తు విడుదలకు వీలుందని తెలిపారు. మంచి వ్యవహారశైలి ఉంటే నెలవారి మూడు రోజుల చొప్పున లెక్కకట్టి మొత్తం జైలుశిక్షలో తగ్గింపు కల్పిస్తారు. ఇప్పటికే ఆమె జైలులో 43 నెలలు పూర్తి చేసుకున్నారు. సత్ప్రవర్తన కారణంగా ఆమె జైలు శిక్ష 129 రోజులు తగ్గాల్సి ఉంది. ఈ మేరకు ఈ నెలాఖరులోనే శశికళ విడుదల అవుతారని ఆమె తరఫు లాయర్లు చెపుతూ వస్తున్నారు.అయితే కర్నాటక ప్రిజన్స్ మాన్యువల్ మేరకు ఈ మేరకు శిక్ష తగ్గింపు నిబంధన ఎత్తివేసేందుకు వీలులేదని ఆమె తరఫు లాయరు ఎన్ రాజా సెంథూర్ పాండియన్ తెలిపారు. అన్ని లెక్కల ప్రకారం చూస్తే శశికళ విడుదల తేదీ సమీపించిందనే తాము భావిస్తున్నట్లు చెప్పారు.

Sasikala to be released from jail in Jan 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News