Saturday, April 27, 2024

దుమ్మురేపిన ఎస్‌బిఐ

- Advertisement -
- Advertisement -
Banks Working Time As Usual In Telangana
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్‌జూన్)లో ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నికర లాభం రూ.6,504 కోట్లతో 55 శాతం వృద్ధిని సాధించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్ల ఈసారి బ్యాంక్ లాభాలు పెరిగాయి. గతేడాది (202021) ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.4,189 కోట్లుగా ఉంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.77,347 కోట్లకు పెరిగింది. గతేడాది ఈ ఆదాయం రూ.74,457 కోట్లుగా ఉంది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ బ్యాంక్ వెల్లడించింది. ఎస్‌బిఐ స్థూల ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తులు) 5.44 శాతం నుంచి 5.32 శాతానికి తగ్గాయి. అదే విధంగా నికర ఎన్‌పిఎ 1.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గింది.

54వేల మార్క్‌కు సెన్సెక్స్

దేశీయ స్టాక్‌మార్కెట్లు రోజురోజుకీ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరుతో బుధవారం కూడా మార్కెట్లు దూసుకెళ్లాయి. ఇక సెన్సెక్స్ 54 వేల మార్క్‌ను చేరుకుని రికార్డు నెలకొల్పింది. ఆఖరికి సెన్సెక్స్ 546 పాయింట్లు పెరిగి 54,370 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 16,258 పాయింట్ల వద్ద స్థిరపడింది.

వరుసగా మూడో నెల సేవల రంగం క్షీణత

వరుసగా మూడో నెల జూలైలోనూ దేశీయ సేవల రంగం క్షీణించింది. కొవిడ్ 19 మహమ్మారి, స్థానిక నిబంధనల వల్ల వ్యాపార కార్యకలాపాలు క్షీణించడం, కొత్త ఆర్డర్లు, ఉపాధి తగ్గడంతో ఈసారి కూడా సేవల రంగం ఆశాజనకంగా లేదు. దేశీయ సేవల వ్యాపార కార్యకలాపాల సూచీ జూన్‌లో 41.2 నుంచి జూలైలో 45.4కు పెరిగింది. అయినప్పటికీ కరోనా సంక్షోభం వల్ల డిమాండ్ మందగించడంతో సేవల రంగం క్షీణతలోనే ఉంది. పిఎంఐ (పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 50కి పైన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను చూపుతుంది. ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలిన్నా డెలిమా మాట్లాడుతూ, ప్రస్తుత కొవిడ్19 పర్యావరణం సేవల రంగంపై ఇప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉందని అన్నారు. జూలై గణాంకాలు నిరుత్సాహపరిచాయని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News