Saturday, April 27, 2024

ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి కెసిఆర్ కృషి: సబితా ఇంద్రా రెడ్డి

- Advertisement -
- Advertisement -

School books distribution at telangana

 

రంగారెడ్డి: తెలంగాణలో రూ.59 కోట్ల 30 లక్షలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల మంది విద్యార్థులకు కోటి 51 లక్షల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తొలకట్ట ప్రభుత్వ పాఠశాలలో విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం కోటి 28 లక్షల పుస్తకాలు మార్కెట్‌లో సిద్ధంగా ఉంచామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 9 లక్షల 44 వేల పైచిలుకు పుస్తకాలను 1,44,591 మంది విద్యార్థులకు అందిస్తున్నామన్నారు.

కరోనా దృష్ట్యా పాఠశాలలు ఆలస్యమైనందున పుస్తకాలు ముందు అందిస్తే విద్యార్థులు ఇళ్లలో చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సిఎం కెసిఆర్ పాఠ్య పుస్తకాల పంపిణీకి ఆదేశాలు ఇచ్చారన్నారు. గ్రామాల్లోని బడుల్లో సౌకర్యాల కల్పనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో మన గుడి లాగా మన బడిని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని సబితా స్పష్టం చేశారు. పాఠ్య పుస్తకాల పంపిణీలో ప్రజా ప్రతినిధులు విద్యా కమిటీ చైర్మన్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ కాలె యాదయ్య, విద్యాశాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News