Saturday, April 27, 2024

కోవిడ్ రోగులకు సెకండ్ వీక్ కీలకం

- Advertisement -
- Advertisement -

Second week is crucial for Covid-19 patients

 సైటోకైన్స్ ప్రభావంతో పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్
అప్రమత్తం లేకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదం
ప్రతి రోజూ ఆరోగ్యమార్పులను గమనించాలని వైద్యులు సూచన

హైదరాబాద్ : కరోనా సోకిన రోగులకు సెకండ్ వీక్ అతి కీలకంగా మారింది. లక్షణాలు తేలిన 4వ నుంచి 7 రోజుల తర్వాత పేషెంట్ శరీరంలో అనూహ్యమైన మార్పులు చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి మార్పులను గమనించకపోతే ముప్పు వా టిల్లే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈక్రమం లో వైరస్ సోకిన మొదటి రోజు నుంచి తీవ్రత తగ్గే వరకు శరీరంలో జరిగే మార్పులను ప్రతి రోజూ గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ సొకడం కంటే, కొందరిలో వాటిని ఎదుర్కొనేందుకు వృద్ధి చెందుతున్న కణాలతోనే ఎక్కువ ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

సెకండ్ వీక్‌లో ఏం జరుగుతోంది?

కోవిడ్ సోకిన పెషెంట్లలో కొందరికి సెకండ్ వీక్ ప్రమాదాన్ని తెస్తుంది. ఈసమయంలోనే ఎక్కువ మందికి శ్వాససమస్యలు వస్తున్నాయని డాక్లర్లు గుర్తించారు. వాస్తవంగా ఎదైన వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి తీవ్రంగా కృషి చేస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన చెడు వైరస్‌ను తరిమికొట్టే కణాలను యాంటీబాడీస్ అని పిలుస్తాము. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను తరిమికొట్టేందుకు కొన్ని రకాల ప్రోటీన్లను(సైటోకైన్స్) విడుదల చేస్తాయి. ప్రస్తుతం కోవిడ్ రోగుల్లో ఇవి కొందరికి వైరస్ సోకిన మూడోరోజు, మరి కొందరిలో 7 రోజుల తర్వాత ఉత్పత్తి అవుతున్నాయి. ఈక్రమంలో వీటి ఉత్పతి సాధారణం కంటే వంద రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే సదరు పేషెంట్‌కు అతి ప్రమాదం ఉండే అవకాశం ఉన్నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెండ్ ప్రో డా రాజరావు తెలిపారు.

ఈ సైటోకైన్ కణాలు వైరస్‌తో పాటు శరీరంలోని ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలపై కూడా దాడి చేసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. వీటి ప్రభావం పెరిగితే ఊపిరితిత్తులలోని నాళాలు దెబ్బతిని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది.ఈక్రమంలోనే ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. దీంతోనే రెండవ వారంలో ఎక్కువ మందికి శ్వాససమస్యలు వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. అయితే దీర్ఘకాలిక రోగాల వారితో పాటు సాధారణ వ్యక్తుల్లోనూ రెట్టింపు సంఖ్యలో సైటోకైన్స్ ఉత్పత్తి కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం రోగనిరోధక వ్యవస్థ దెబ్బతీనడమేనని నిపుణులు చెబుతున్నారు.

సైటోకైన్స్ తీవ్రతను ఎలా పసిగట్టాలి?

సైటోకైన్ ప్రభావంతో రక్తంలోని సిఆర్పి(సి రియాక్టివ్ ప్రోటీన్) పెరుగుతోంది. సిఆర్పి 15 కంటే ఎక్కువ ఉంటే సైటోకైన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఒకవేళ సిఆర్పి టెస్టులో లెవల్స్ ఎక్కువుంటే ఐఎన్ 6 అనే టెస్టు చేపించుకోవాలి. రక్తంలో ఇది 2 పికోగ్రామ్స్ వరకు ఉంటే సాధారణంగా ఉన్నట్లు లెక్క. దాని కంటే అధికంగా ఉంటే సుమారు 40 నుంచి 50 శాతం ప్రమాదంలో ఉన్నామని గమనించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో వైరస్ లక్షణాలను వేగంగా గమనించి టెస్టులు చేపించుకోని మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

బి సెల్స్‌తోనూ ప్రమాదమే

రోగ నిరోధక వ్యవస్థకు అతి ముఖ్యమైన తెల్లరక్తకణాల్లో టి,బి సెల్స్ ఉంటాయి. ఎముక మజ్జలో టి కణాలు పుట్టి థైమస్ గ్రంథిలోకి వెళతాయి. అక్కడ్నుంచే ఈకణాలు విడుదలవుతాయి. అయితే వీటిలో సహయం చేసివి, చంపేవి, సాధారణం అనే మూడు రకాల్లో ఉంటాయి. టి, బి కణాల మధ్య సమన్వయం లేకపోయినా సదరు వ్యక్తికి ముప్పు తప్పదు. శరీరంలో ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలను ఎదుర్కొనేందుకు బి సెల్స్ యాంటీబాడీస్‌ను పుట్టిస్తాయి. అయితే కొన్ని సందర్బాల్లో సాధారణ టి సెల్స్ పనిచేయకపోతే మన శరీరంలోని కణాలు మనకే యంటీలుగా తయారవుతాయి.

అయితే కోవిడ్ వైరస్ సోకిన 60 ఏళ్ల దాటిన వాళ్లల్లో ఈ విధమైన మార్పులు వచ్చి ప్రమాదాన్ని తెస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కోవిడ్ వైరస్ తీవ్రత ప్రస్తుతం రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉండటం లేదు. చాలా మందికి మొదటి వారంలోనే మందుల వాడకంతో తగ్గిపోతుంది. కానీ వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశ్యంతో ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం 14 రోజుల వైరస్ ఇంక్యూబేషన్ పీరియడ్‌ను తప్పనిసరిగా పాటిస్తున్నారు. మరి కొందరికి మొదటి వారంలో కోలుకుంటున్నట్లు ఉన్నప్పటికీ, రెండో వారంలో ఆకస్మత్తుగా కుప్పకూలిపోతున్నారు.ఈ ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించడం వలనే కొంత మంది చనిపోతున్నట్లు వైద్యులు చెప్పుకొస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News