Friday, May 10, 2024

అకాల నష్టం

- Advertisement -
- Advertisement -

Rice crops

 

కామారెడ్డి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం
కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం
వరి పంటలకు తీవ్ర నష్టం
పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి

మన తెలంగాణ/న్యూస్‌నెట్‌వర్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం అకాల వర్షం కు రిసింది. కామారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల , ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో అకాల వర్షం పడింది. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోయారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో పిడుగుపడి మట్ట బుచ్చిరెడ్డి (35) అనే రైతు చనిపోయాడు. బుచ్చిరెడ్డి కుటుంబాన్ని ఎంఎల్‌ఎ రామలింగారెడ్డి పరామర్శించారు. బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే జిల్లాలోని హుస్నాబాద్ పరిధిలోని అక్కన్నపేటలో కురిసిన అకాల వర్షం తో పంట నష్టం తీవ్రంగా జరిగింది. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆర్‌డిఒ జ యచంద్రారెడ్డి, రెవెన్యూ, వ్యవసాయాధికారులు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. హుస్నాబాద్‌లో వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.

అదేవిధంగా చేగుంట, నార్సింగి,నంగునూరు మండలాల్లో కూడా వర్షం పడి రైతులు నష్టపోయారు. కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. రాజంపేట, గాంధారి మండలాల్లో భారీ వ ర్షం పడి అపార నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఆదివారం ఉదయం భారీ వర్షం పడింది. ఈ క్రమంలో తీవ్ర పంట నష్టం జరిగింది. చందుర్తిలో భార్యతో కలిసి పొలానికి వెళ్లిన పల్లా శ్రీనివాస్ అనే రైతు పిడుగు పాటుకు గురై చనిపోయాడు. అతడి భార్య గాయపడింది. పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పంట నష్టం కూడా తీవ్రంగా జరిగిందని రైతులు వాపోయారు.

 

Severe damage to Rice crops
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News