Saturday, April 27, 2024

సుష్మా స్వరాజ్ భర్తపై థరూర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

shashi

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షాపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నసీరుద్దీన్ షా సహచర నటుడు అనుపమ్ ఖేర్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్వరాజ్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ నసీరుద్దీన్ షాను కృతజ్ఞుడుగా అభివర్ణించడాన్ని థరూర్ తప్పుపట్టారు. బిజెపి మద్దతుదారుడైన అనుపమ్ ఖేర్‌ను విదూషకుడిగా నసీరుద్దీన్ షా ఇటీవల ఒక ఇంటర్వూలో వర్ణించారు. దీనికి అనుపమ్ ఖేర్‌కు జవాబిస్తూ ఏళ్ల కొద్ది మీరు తీసుకుంటున్న పదార్థాలు మీలోని విచక్షణాజ్ఞానాన్ని నశించపచేశాయంటూ వ్యాఖ్యానించారు.

వీరి మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధంపై స్వరాజ్ గురువారం ట్వీట్ చేస్తూ నసీరుద్దీన్ షాను కృతజ్ఞుడిగా పేర్కొన్నారు. ఈ దేశం మీకు కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు ఇచ్చింది. అయినప్పటికీ మీకు సంతృప్తి లేదు. మీరు మతాంతర వివాహం చేసుకున్నారు. ఏనాడూ దీన్ని ఎవరూ వేలెత్తి చూపించలేదు. మీ సోదరుడు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. మీకు ఈ దేశం ఏం తక్కువ చేసింది.

సమాన అవకాశాలు కల్పించలేదా? అంటూ నసీరుద్దీన్ షాను స్వరాజ్ ప్రశ్నించారు. దీనిపై శశి థరూర్ ఘాటుగా స్పందించారు. గవర్నర్ సాబ్..మతాంతర వివాహం చేసుకోవడం ఇప్పుడు జాతి వ్యతిరేకమా? లేక అనుపమ్ ఖేర్‌ను విమర్శించడమా? మీ స్నేహితుడిని సమర్థించుకునే హక్కు మీకు ఉంది..కాని మీ అనౌచిత్య ట్వీట్‌లో పేర్కొన్న కారణాలు మాత్రం సమర్థనీయం కావు అంటూ థరూర్ చురకలు అంటించారు.

Shashi Tharoor slams Swaraj Kaushal, Is marrying outside religion anti -national, Tharoor asks Kaushal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News