Saturday, May 4, 2024

‘శ్యామ్ సింగరాయ్’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేచురల్ స్టార్ నానీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి, కృతి‌శెట్టి, మడోనా సెబాస్టియన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 14న  విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. నాని కెరీర్ లో క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shyam Singha Roy Trailer to release on Dec 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News