Monday, April 29, 2024

జనవరి 10లోగా స్టీల్ పరిశ్రమలను తరలించండి: బాలమల్లు

- Advertisement -
- Advertisement -

Steel factory send to ORR

హైదరాబాద్: జనవరి 10 తుది గడువులోగా తప్పనిసరిగా రాకంచర్లకు తరలించాలని స్టీల్ పరిశ్రమల యజమానులను టిఎస్ ఐఐసి చైర్మన్ బాలమల్లు ఆదేశించారు. కాటేదాన్ కాలుష్య కారక స్టీల్ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలింపుపై సోమవారం టిఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో 2008లో షిఫ్టింగ్ నోటీసులు జారీచేసిన కాటేదాన్ లోని కాలుష్య కారక స్టీల్ పరిశ్రమలను వికారాబాద్ జిల్లా రాకంచర్ల లో కేటాయించిన” స్టీల్ ఇండిస్ట్రియల్ పార్క్ “కు వెంటనే తరలించాలని నిర్ణయించారు. ఇదే చివరి అవకాశమని.. పరిశ్రమల తరలింపులో సమస్యలు ఏమైనా సమస్యలుంటే పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో చేవెళ్ల రంజిత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొని పరిశ్రమల తరలింపుపై పలు సూచనలు చేశారు. సమావేశంలో టిఎస్ ఐఐసి ఎండి వెంకట్ నర్సింహారెడ్డి, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మెన్ విజయ్ కుమార్, టిఎస్ ఐఐసి సిఇ శ్యామ్ సుందర్, జోనల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News