Wednesday, May 1, 2024

అరుణాచల్‌లో మిత్ర విచిత్రం

- Advertisement -
- Advertisement -

Six JDU MLAs into the BJP in Arunachal pradesh

 

బిజెపిలోకి ఆరుగురు జెడియు ఎమ్మెల్యేలు

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో జనతాదళ్ (యునైటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. అదీ మిత్రపక్షం బిజెపి నుంచి కావడం రాజకీయం అయింది. శుక్రవారం పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురు అధికార బిజెపిలో చేరారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీ అధికార వర్గాలు ఓ బులెటిన్‌లో తెలిపాయి. జెడియు బిజెపి మిత్రపక్షంగా ఉంది. బీహార్‌లో రెండు పార్టీల మిత్రత్వంతోనే ఇటీవల సర్కారు కూడా ఏర్పడింది. ఈ దశలో రెండు పార్టీల మధ్య వైరుద్ధాలు తలెత్తేలా అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలు సంభవించాయి. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరిన విషయం నిర్థారణ కావడం స్థానికంగా రాజకీయ సంచలనం కల్గించింది. ఇటీవలే జెడియు ఎమ్మెల్యేలు కొందరికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా నోటీసులు వెలువరించారు.

వారు ఇతరులు ఇప్పుడు పార్టీ వీడారు. ఈ ఎమ్మెల్యేలతో పాటు పీపుల్స్ పార్టీ ఆఫ్‌అరుణాచల్ (పిపిఎ)కు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కరో న్యిగ్యోర్ కూడా బిజెపిలో చేరారు. ఈ ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేను ఇటీవలే పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పటి ఫిరాయింపుల క్రమంతో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్యాబలం 60 కాగా బిజెపి బలం 48కు చేరింది. జెడియుకు ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)కి నలుగురేసి ఎమ్మెల్యేల బలం ఉంది. అరుణాచల్ ప్రభావం బీహార్ రాజకీయాలపై పడుతుందా? అనేది వెల్లడికాలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News