Saturday, May 4, 2024

బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం: ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Six Members dead in Plane crash in brazil

 

రియో ది జనిరియో: బ్రెజిల్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. టొకాన్టిన్ నుంచి గోయోనియా ప్రాంతానికి నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లతో పాటు ఆ క్లబ్ అధ్యక్షుడు లుకాస్ ఓ ప్రైవేటు విమానంలో వెళ్తుండగా టెకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది. ఈ మొత్తం ఆరుగురు చనిపోయారు. మృతులు లుకాస్ మెయిరా, లుకాస్ ప్రెక్సిడిస్, గెయిల్ హార్మీ, రనులే, మార్కస్ మోలినారీ, పైలట్ కూడా ఉన్నారు. విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 2016లో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు చనిపోయారు. ఈ ప్రమాదంపై జైర్ బోల్సోనారో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News