Wednesday, May 1, 2024

ఎన్నికల్లో పంజాబ్ నుంచి పోటీ చేయనున్న సోనూ సూద్ సోదరి!

- Advertisement -
- Advertisement -

Sonu Sood and Malvika

మోగా(పంజాబ్): అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సు దోచుకున్న సినీ నటుడు సోనూ సూద్ ఆదివారం కీలక ప్రకటన చేశాడు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. అయితే ఆమె ఏ పార్టీ తరఫున పోటీచేయబోతోందో మాత్రం వెల్లడించలేదు. కానీ “ మాళవిక పోటీకి రెడీ అయ్యారు. ప్రజలకు సేవచేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయాలోకి రావడం అన్నది సిద్ధాంతాలకు ముడిపడిన విషయం. ఆమె ఏ పార్టీలో చేరనున్నారనేది తగిన సమయంలో ప్రకటిస్తాం” అని మోగాలోని తన నివాసంలో మీడియాకు సోనూ సూద్ వెళ్లడించారు. సోనూసూద్, ఆయన సోదరి మళవికతో కలిసి ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా భేటీ అయ్యారు. అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్ కా మెంటర్స్’ కార్యక్రమానికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే కేజ్రీవాల్‌ను కలిశాక ఆయన కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, చిక్కులకు లోనయ్యారన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News